Begin typing your search above and press return to search.

బాలీవుడ్ 'బాంబ్'పై పోలీసులకు ఫిర్యాదు చేసిన హాట్ బ్యూటీ బాంబ్

By:  Tupaki Desk   |   8 Nov 2022 4:46 AM GMT
బాలీవుడ్ బాంబ్పై పోలీసులకు ఫిర్యాదు చేసిన హాట్ బ్యూటీ బాంబ్
X
ఇద్దరు ఇద్దరే అన్నట్లు ఉంటుంది బాలీవుడ్ లో ఈ ఇద్దరు హీరోయిన్ల తీరు చూస్తే. ఈ ఇద్దరు తరచూ ఏదో ఒక సంచలనాలకు కేంద్రంగా.. వివాదాల్లో వీరి పేర్లు వినిపిస్తూ ఉంటాయి. అయితే ఈ ఇద్దరు భామలు సినిమాలతో పేరు ప్రఖ్యాతుల్ని తెచ్చుకున్నారనే కంటే కూడా తమ మాటలతోనూ.. చేతలతోనే వార్తల్లో నిలుస్తుంటారు. అవకాశం ఇవ్వాలే కానీ గ్లామర్ ను టన్నుల కొద్దీ పోసే ఈ ఇద్దరిలో ఒకరికి హాట్ బ్యూటీగా పేరుంటే.. మరొకరికి బ్యూటీ బాంబ్ గా పేరుంది.

ఇంతకీ ఆ ఇద్దరు ఎవరో కాదు.. హాట్ బాంబ్ రాఖీ సావంత్.. బ్యూటీ బాంబ్ షెర్లిన్ చోప్రా. ఇప్పుడీ ఇద్దరు భామల మధ్య నడుస్తున్న పంచాయితీ ఇప్పుడు పోలీసులు.. ఫిర్యాదుల వరకు వెళ్లిపోయింది. మీటూ ఇష్యూలో తీవ్రమైన ఆరోఫణలు చేస్తూ బిగ్ బాస్ కంటెస్టెంట్ సాజిద్ ఖాన్ పై మండిపడటం తెలిసిందే.

ఇతగాడిపై తాజాగా షెర్లిన్ చోప్రా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉంటే సాజిద్ తరపు వకల్తా పుచ్చుకొని మాట్లాడుతున్న రాఖీ సావంత్ పై షెర్లిన్ మండిపడుతోంది. దీంతో.. ఈ ఇద్దరు బ్యూటీ బాంబ్స్ పోలీసులకు ఫిర్యాదులు చేసుకుంటున్నారు.

తాజాగా ముంబయిలోని అంబోలి.. ఓషివారా పోలీస్ స్టేషన్ లలో రాఖీసావంత్ పై పోలీసులకు కంప్లైంట్ చేసింది షెర్లిన్ చోప్రా. దీనికి సంబంధించిన ఫిర్యాదు కాపీని.. తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది.

పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాక మీడియాతో మాట్లాడింది షెర్లిన్ చెప్రా. ఈ సందర్భంగా ఒక వీడియోను ప్రదర్శించి రాఖీపై మండిపడింది. సాజిద్ ఖాన్ పై మీటూ ఆరోపణలు చేసిన వారంతా కూడా అబద్ధాలే చెబుతున్నారా? అంటూ ప్రశ్నించింది షెర్లిన్ చోప్రా.

దీనికి ప్రతిగా రాఖీ సావంత్ కూడా రియాక్టు అయ్యింది. షెర్లిన్ చెప్రాపై కేసు పెట్టింది రాఖీ. షెర్లిన్ డబ్బుకోసం శక్తివంతమైన వ్యక్తుల్నిబ్లాక్ మొయిల్ చేస్తుందని రాఖీ ఆరోపించింది. ఇదిలా ఉంటే.. సాజిద్ పై షెర్లిన్ చోప్రానే కాదు.. పలువురు నటీమణులు మీటూ ఆరోపణలు చేయటం తెలిసిందే. ఆ జాబితాలో షెర్లిన్ తో పాటు.. సలోని చోప్రా.. ఆహానా కుమ్రా.. మందన కరిమిలు ఉన్నారు. వారంతా కూడా అతడి మీద కంప్లైంట్లు చేశారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.