Begin typing your search above and press return to search.

కామసూత్ర కథ.. కేన్స్ తోనే ఆగిందా?

By:  Tupaki Desk   |   14 July 2016 5:22 AM GMT
కామసూత్ర కథ.. కేన్స్ తోనే ఆగిందా?
X
నాలుగేళ్ల క్రితం అనుకుంటా.. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఓ సంచలనమైన న్యూస్ ఒకటి వచ్చింది. బాలీవుడ్ హాటీ షెర్లిన్ చోప్రా.. కామసూత్ర పేరుతో తీస్తున్న ఓ 3డీ మూవీలో నటిస్తోందని.. అది కూడా హాలీవుడ్ సినిమాల టైపులో ఒంటిపై నూలుపోగు లేకుండా నటించేస్తోందనే వార్తలు హల్ చల్ చేశాయి.

ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడమే కాదు.. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది కూడా. కొంతమేర పిక్చరైజేషన్ జరిగాక.. కామసూత్ర 3డీ ఆగిపోయింది. అసలు ఈ ప్రాజెక్ట్ ఎందుకు ఆగిపోయిందో.. ఇప్పుడు అసలు విషయం బైటకొచ్చింది. కామసూత్ర 3డీ ఆగిపోవడానికి కారణం ఆ సినిమా డైరెక్టర్. ఈ విషయంపైనా.. తనను మోసం చేశాడంటూ షెర్లీన్ స్వయంగా ఓ పోలీస్ కంప్లెయింట్ కూడా ఇఛ్చింది. తనకు ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ విషయంలో మోసం చేశాడని.. తన సంతకాలను ఫోర్జరీ చేసి మాయ చేశాడని.. సినిమా షూటింగ్ టైమ్ లో సెక్సువల్ గా టార్చర్ చేసేవాడని చెప్పింది షెర్లీన్ చోప్రా.

అంతే కాదు.. అప్పుడప్పుడు అసభ్యకరమైన మెసేజ్ లు.. మెయిల్స్ కూడా పంపేవాడట. అందుకే షూటింగ్ సగంలో ఆగిపోయిన ఈ కామసూత్ర 3డీ ప్రేక్షకుల ముందుకు రాలేదు. కానీ 2013 కేన్స్ లో మాత్రం తీసినంతవరకూ ప్రదర్శించారట. ఇక ఇది జనాల ముందుకు వచ్చే అవకాశం లేనట్లే.