Begin typing your search above and press return to search.
'షేర్ని' ట్రైలర్: నిజాయితీ గల ఫారెస్ట్ ఆఫీసర్ గా విద్యాబాలన్..!
By: Tupaki Desk | 2 Jun 2021 9:46 AM GMTబాలీవుడ్ భామ విద్యాబాలన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ''షేర్ని''. 'న్యూటన్' ఫేమ్ అమిత్ మసూర్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూన్ 18న డైరెక్ట్ ఓటీటీ విధానంలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రిలీజ్ చేయబడిన ప్రచార చిత్రాలు - టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా 'షేర్ని' ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
సవాల్ విసిరే ఏ పాత్రకైనా న్యాయం చేయగలిగే విద్యాబాలన్ 'షేర్ని' చిత్రంలో ఒక నిజాయితీ గల లేడీ ఫారెస్ట్ ఆఫీసర్ గా కనిపిస్తున్నారు. అటవీప్రాంతంలోని గ్రామస్తులను భయాందోళనకు గురి చేస్తున్న ఓ ఆడపులి ని గుర్తించడం కోసం విద్యాబాలన్ తన టీమ్ తో కలిసి బయలుదేరినట్లు ట్రైలర్ లో చూపించారు. పులిని పట్టుకోకపోవడం ఒక లేడీ ఆఫీసర్ వల్ల అయ్యేపని కాదని అందరూ నిరాశ చెందుతున్న సమయంలో ఆమె మరిన్ని భయంకరమైన నిజాలు తెలుసుకుంటారని తెలుస్తోంది.
మనుషులు - జంతువులు ఒకరి మీద ఒకరు ఎలా ఆధారపడతారు అనేది తెలియజేస్తూ.. జంతు హక్కుల గురించి వివరించే పాత్రలో విద్యాబాలన్ కనిపిస్తోంది. ఆమె మరోసారి ఛాలెంజింగ్ రోల్ లో మెప్పించబోతున్నట్లు అర్థం అవుతోంది. అయితే పులుల నేపథ్యంలో సాగే కథాంశమైనప్పటికి ట్రైలర్ లో ఎక్కడా పులిని చూపించలేదు. దీనిని బట్టి నిజంగానే ఆడపులి అక్కడి మనుషులను చంపుతోందా? లేదా పులి పేరుతో ఎవరైనా ప్లాన్ చేసి ఈ హత్యలు చేస్తున్నారా అనేది తెలియాలంటే 'షేర్ని' సినిమా చూడాల్సిందే.
దర్శకుడు అమిత్ మసూర్కర్ 'న్యూటన్' తరహాలోనే మరో కొత్త తరహా సినిమాతో రాబోతున్నట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్ లోని దట్టమైన అడవుల్లో ఈ సినిమా షూటింగ్ జరిపారు. ఈ చిత్రంలో విజయ్ రాజ్ - నీరజ్ కబీ - ఐలా అరుణ్ - శరత్ సక్సేనా - ముకుల్ చద్దా తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. టి-సీరీస్ సమర్పణలో అబండంటియా ఎంటర్టైన్మెంట్ సంస్థ 'షేర్ని' చిత్రాన్ని నిర్మించింది. భూషణ్ కుమార్ - క్రిషన్ కుమార్ - విక్రమ్ మల్హోత్రా నిర్మాతలుగా వ్యవహరించారు. 'శకుంతలా దేవి' తర్వాత ఓటీటీలో విడుదలవుతున్న విద్యాబాలన్ నటించిన చిత్రానికి ఎలాంటి ఆదరణ దక్కుతుందో చూడాలి.