Begin typing your search above and press return to search.

పెళ్లి తేదీని ప‌చ్చ‌బొట్టు పొడిపించుకున్న న‌టి!

By:  Tupaki Desk   |   28 Feb 2022 12:30 AM GMT
పెళ్లి తేదీని ప‌చ్చ‌బొట్టు పొడిపించుకున్న న‌టి!
X
గాయ‌ని కం న‌టి శిబానీ దండేకర్ తన చేతిపై పెళ్లి తేదీని టాటూగా వేయించుకుంది. అంతేకాదు త‌న హ‌బ్బీ ఫర్హాన్ అక్తర్ తో అదిరే పోజులిచ్చి నవ్వింది. తాజా ఫోటోషూట్ ని ప‌రిశీలిస్తే.. శిబానీ దండేకర్ తన పెళ్లి తేదీని చేతిపై టాటూగా వేయించుకుని క‌నిపించింది.

గత వారం ఫర్హాన్ అక్తర్ ను శిబానీ వివాహం చేసుకుంది. ద‌ర్శ‌క‌నిర్మాత-నటుడు ఫర్హాన్ అక్తర్ కి ఇది రెండో పెళ్లి. టెలివిజన్ రంగంలో రాణించిన శిబానీ దండేకర్ అటుపై ఫ‌ర్హాన్ తో ప్రేమ‌లో ప‌డింది. ఈ జంట చాలా కాలంగా స‌హ‌జీవ‌నంలో ఉన్నారు. ఎట్ట‌కేల‌కు శిబానీ - ఫర్హాన్ జంట ఫిబ్రవరి 19న ఖండాలాలోని ఫర్హాన్ కుటుంబ ఫామ్ హౌస్ లో వివాహం చేసుకున్నారు.

అలాగే టాటూ మ్యాట‌ర్ కి వ‌స్తే... శిబానీ దండేకర్ తన చేతిపై మరో టాటూను వేయించుకుంది. పెళ్లి తేదీ పచ్చబొట్టు పైన 27 అనే సంఖ్యను గుర్తుతో పాటు నిలువుగా రాశారు. ఆమె ఉంగరపు వేలుపై పచ్చబొట్టు కూడా కనిపించింది. ఆమె కుడి చేతిపై పక్షుల టాటూ కనిపించింది.

ఇన్ స్టాగ్రామ్ లో శిబానీ కెమెరాకు పోజులిచ్చిన ఫోటోలను పోస్ట్ చేసింది. ఫోటో షూట్ కోసం మెరిసే లేత గోధుమరంగు బాడీకాన్ దుస్తులను ధరించింది. ఈ ఫోటోలను పంచుకుంటూ ఆమె రింగ్ ఎమోజీని జోడించింది. ఈ పోస్ట్ పై ఫరా ఖాన్ స్పందిస్తూ -పెళ్లయ్యాక (రెడ్ హార్ట్ ఎమోజి) మీరు మరింత అందంగా మారార‌ని నేను భావిస్తున్నాను అని వ్యాఖ్యానించింది.

సంబంధిత కథనాలు షిబానీ దండేకర్ ఫర్హాన్ అక్తర్ తో కోర్టు వివాహానికి సిద్ధమవుతున్నప్పుడు చిత్రాన్ని పంచుకున్నారు.

ఫర్హాన్ అక్తర్ ఇంత‌కుముందు పెళ్లిలో త‌న‌ కూతుళ్లతో పోజులిచ్చాడు. హృతిక్ రోషన్ - షబానా అజ్మీతో కలిసి ఏక్ పాల్ కా జీనాకు డ్యాన్స్ చేసిన వీడియో వైర‌ల్ అయ్యింది. జోయా అక్తర్ త‌న‌ సోదరుడు ఫర్హాన్ అక్తర్- షిబానీ దండేకర్ వివాహాన్ని ఒక స్వీట్ పోస్ట్ లో అభినందించారు.

ఇటీవల శిబానీ తన పేరుకు ఫర్హాన్ ఇంటి పేరును జోడించి ఇన్ స్టాగ్రామ్ అధికారికంగా చేసింది. ఆమె ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఇప్పుడు ఆమె పేరు షిబానీ దండేకర్ అక్త‌ర్ గా మారింది. నిర్మాత- సమర్పకురాలు- నటి- గాయని.. శ్రీమతి అక్తర్ ఇలా ఆమె తన బయోని కూడా అప్ డేట్ చేసింది.