Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: మోడరన్ ఖజురహో మోడల్

By:  Tupaki Desk   |   26 Jun 2019 6:16 AM GMT
ఫోటో స్టొరీ: మోడరన్ ఖజురహో మోడల్
X
హీరోయిన్ గా బాలీవుడ్ లో సినిమాలేవీ చెయ్యకపోయినా షిబాని దండేకర్ సోషల్ మీడియాలో సూపర్ పాపులర్. కారణం ఏంటంటే.. షిబాని స్పోర్ట్స్ యాంకర్ కం టీవీ హోస్ట్. ఆమె ఒక హాట్ మోడల్. అంతే కాదు బాలీవుడ్ యాక్టర్ - డైరెక్టర్ ఫర్హాన్ అఖ్తర్ కు ప్రెజెంట్ గర్ల్ ఫ్రెండ్. వయసు 38.. కానీ పాతికేళ్ళ బ్యూటీలా గ్లామర్ ఫిట్నెస్ మెయింటెయిన్ చేస్తూ ఉంటుంది.

తాజాగా షిబాని ఒక ఫోటో షూట్ కు హాజరైంది. తనకు అలవాటైన రీతిలో అత్యంత హాటుగా పోజిలిచ్చి రెచ్చిపోయింది. ఈ ఫోటో చూసిన ఎవరైనా షిబానికి హాట్ నెస్ కు శాశ్వతమైన ఆరాధకుడుగా మారిపోవడం ఖాయమే. ఒక బ్రౌన్ కలర్ లెదర్ జాకెట్ ధరించి.. బటన్స్ పెట్టుకోకుండా ఒక చేతిని జుట్టు సవరించుకుంటూ.. మరో చేతిని తనకు అందాలకు ఆచ్చాదనగా ఉంచింది. "అదేదో లెదర్ జాకెట్ కు బటన్ పెట్టుకొని ఏడవచ్చు కదా" అని ఎవరైనా పంచ్ డైలాగ్ వెయ్యొచ్చు కానీ వారికి బొత్తిగా కలాపోసన లేనట్టే..! అలా పెట్టుకుంటే హాట్ నెస్ ఎలా వస్తుంది చెప్పండి? అర్థం చేసుకోరూ...

షిబాని ఇంత హాట్ కాబట్టే అఖ్తర్ సాబ్ అరమరికలు లేకుండా ప్రేమిస్తూ ఉన్నారు. సమయం చిక్కితే చాలు వెకేషన్లు ప్లాన్ చేసుకుంటూ.. ఈ పాడు ప్రపంచం నుండి కాస్త దూరంగా వెళ్లి ఒకరి ఒడిలో మరొకరు సేద తీరుతూ ఉన్నారు. ఇదిలా ఉంటే షిబాని ఇప్పటివరకూ కొన్ని సినిమాల్లో తక్కువ నిడివి ఉండే పాత్రలు చేసింది. ప్రస్తుతం 'క్వీన్' తెలుగు రీమేక్ 'దట్ ఈజ్ మహాలక్ష్మి' సినిమాలో కూడా ఒక పాత్రలో నటిస్తోందట. సో.. తెలుగు ప్రేక్షకులను త్వరలో పలకరించడానికి ఈ హాటు బ్యూటీ రెడీ.. మీరు రెడీనా?