Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: బికినీ ప్లస్ చాక్లెట్.. డెడ్లీ నో!

By:  Tupaki Desk   |   7 Sep 2019 5:38 AM GMT
ఫోటో స్టొరీ: బికినీ ప్లస్ చాక్లెట్.. డెడ్లీ నో!
X
కొంతమంది ఏళ్ళ తరబడి సినిమాలు చేస్తూ ఉంటారు. కానీ వారి పేర్లు జనాలకు తెలియవు.. ఎక్కువ మాట్లాడితే ఇండస్ట్రీ లో ఉండేవారికి కూడా తెలియవు. కానీ కొందరు మాత్రం ఏం సినిమాలు చేయకపోయినా హీరోయిన్ల తరహాలో క్రేజీగా మారతారు. సరిగ్గా అలాంటి బ్యూటీనే షిబాని దండేకర్. ఆమె ఎవరు అంటే ఫర్హాన్ అఖ్తర్ సాబ్ గారికి కాబోయ్ బేగమ్ అని చెప్పాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం ఇద్దరూ అరమరికలు లేకుండా ప్రేమించుకుంటూ ఉన్నారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.

అసలు సినిమాలే చెయ్యకపోయినా ఎందుకు ఆవిడ ఫేమస్ అంటే.. ఒకటి- బాయ్ ఫ్రెండ్ ఫర్హాన్ సాబ్. రెండో కారణం ఏంటంటే - ఈ భామ స్పోర్ట్స్ యాంకర్ కం టీవీ హోస్ట్. వయసు 38.. కానీ 25 ఏళ్ళ భామలా కనిపిస్తూ ఉంటుంది. కఠినమైన కసరత్తులు ఆమె దినచర్యలో భాగం. ఇక సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేసిందంటే జనాలు "కెవ్వు కేక. కెవ్ కెవ్ కెవ్ కే...కా" అంటూ పాడుకోవల్సిందే. తాజాగా తన హాటు ట్రెండ్ ను కంటిన్యూ చేస్తూ ఒక కత్తి లాంటి ఫోటోను ఇన్స్టా ఖాతా లో ఎత్తి పడేసింది. ఈ ఫోటోకు ఆమె ఇచ్చిన పెద్ద క్యాప్షన్ ను క్లుప్తంగా చెప్పుకుంటే "ఇది యాడ్ కాదు. గ్రెనేడ్(Grenade) బార్స్ సూపర్. అన్నీ ఫ్లేవర్లు అద్భుతం. తింటే ఇక వదలరు" అర్థం అయింది కదా నాయనలారా.. అదేదో చాక్లెట్ అంట.. భలే ఉందంట.

అయితే ఆ చాక్లెట్ ను మునిపంటితో కొరికి పట్టుకుని బికినీ ధరించిన పోజు 'నభూతో నభవిష్యతి'. చక్కగా చదవండి.. ఒత్తులు ఉన్నాయి! ఇక ఈ ఫోటోతీసిన వారు షాన్ బైర్న్స్. ఈ ఫోటో ను తీసిన స్టైల్ లోనే ఈ వ్యక్తి టాలెంట్ మనం అర్థం చేసుకోవచ్చు. హ్యాట్ పెట్టుకున్న నీడలో లిప్స్ కు పైభాగం వరకూ కవర్ అయింది. ఇక షిబాని చూపించాల్సిన.. కళాపోషకులు కనిపించాల్సిన భాగం అంతా లైటింగ్ లో ఉంది ఆ టేస్టీ చాకొలేట్ తో సహా! అయినా అఖ్తర్ సాబ్ అంత మల్టీ టాలెంటెడ్ పర్సోన్ బాలీవుడ్ లోనే కాదు ఇండియాలో ఉన్న అన్నీ ఫిలిం ఇండస్ట్రీలో భూతద్దం పెట్టి వెతికినా కనిపించరు. ఆయన ఈ భామతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడంటేనే మనం షిబాని టాలెంట్ ను అర్థం చేసుకోవాలి. ఇక ఈ ఫోటోకు మొదట లైక్ కొట్టింది అఖ్తర్ సాబే.

ఈ ఫోటోకు కత్తిలాంటి కామెంట్లు వచ్చాయి కానీ అవన్నీ మనం రెగ్యులర్ గా చెప్పుకునేవే. వాటిలో ఒకటి మాత్రం పర్ఫెక్ట్ ప్రశ్న.. ఒక నెటిజన్ "బెల్లీ బటన్ కింద ఉండే మచ్చ సర్జరీ వల్ల వచ్చిందా?" అని ప్రశ్నించాడు. దీన్ని బట్టి అర్థం అయ్యేదేంటంటే ప్రేక్షకులకు ఏం తెలియదు అనుకోవడం మన భ్రమ. వారికి అన్నీ కనిపిస్తాయి.. అన్నీ అర్థం అవుతాయి.