Begin typing your search above and press return to search.
పవన్ ఫ్యాన్స్.. అప్పట్లోనే బెదిరిన యాంకర్
By: Tupaki Desk | 11 April 2018 4:36 AM GMTఏ యాంకర్ కు అయినా పవన్ కళ్యాణ్ సినిమా ఆడియో ఫంక్షన్ ను హోస్ట్ చేయడం అంటే కల సాక్షాత్కారం కావడంగానే చెప్పాలి. కానీ కాసింత అనుభవం గడించిన తర్వాత ఈ అవకాశం వస్తే సంగతేమో కానీ.. తొలి రోజుల్లోనే పవన్ కళ్యాణ్ ను స్టేజ్ పైకి పిలిచే అవకాశం కంటే.. ఆనందం కంటే ముందు భయం మనసులోకి వచ్చేస్తుంది.
ఖుషీ మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ సమయంలో తన పరిస్థితి ఇలాగే ఉందని యాంకర్ గాను.. అడపా దడపా యాక్ట్రెస్ గాను మెరిసిన శిల్పా చక్రవర్తి చెబుతోంది. ఈమె నిజానికి బెంగాలీ. తెలుగు నేర్చుకోవడం అప్పుడప్పుడే మొదలు పెట్టింది. అలాంటి సమయంలో ఖుషీ ఆడియో ఫంక్షన్ ను నిర్వహిస్తుండగా.. పవన్ కళ్యాణ్ ను స్టేజ్ పైకి ఆహ్వానించాలని చెప్పారట నిర్వాహకులు. ఆ మాటకే ప్రాణాలు పోయినంత పనైందని.. ఒళ్లంతా వణికిపోయిందని.. చిరంజీవి గారి బ్రదర్ అని మినహాయిస్తే.. అప్పట్లో ఆయన గురించి తనకు ఏమీ తెలియదని చెప్పింది శిల్పా చక్రవర్తి.
అయితే.. స్టేజ్ పై ఝాన్సీ కూడా ఉంటుందని.. ఆమెతో పాటు కలిసి ఆ కార్యక్రమం నిర్వహించాలని చెప్పారన్న శిల్పా చక్రవర్తి.. తీరా ఆడిటోరియంలో ఉన్న జనాలను చూసి ఆశ్చర్యంతో పాటు భయం కూడా వేసిందని చెప్పింది. కానీ తన తొలి రోజుల్లోనే అంత పెద్ద ఫంక్షన్ నిర్వహించడం.. ఆ తర్వాత రోజుల్లో తన కెరీర్ కు బాగా ఉపయోగపడిందని చెప్పింది ఈ యాంకర్.