Begin typing your search above and press return to search.
షాకింగ్: అవేవీ తనకు తెలియదనేసిన శిల్పాశెట్టి..!
By: Tupaki Desk | 17 Sep 2021 2:30 AM GMTబాలీవుడ్ సోయగం శిల్పాశెట్టి తాజాగా మీడియాకు బిగ్ షాకిచ్చింది. తనకు తెలిసిన విషయాన్నితెలియదని చెప్పి పెద్ద షాకే ఇచ్చింది. శిల్పా భర్త రాజ్ కుంద్రా నీలి చిత్రాల కేసులో అరెస్ట్ కావడం ప్రస్తుతం జైల్లో వుండటం తెలిసిందే. సర్వత్రా చర్చనీయాంశంగా మారిన రాజ్ కుంద్రా ఉదంతం బాలీవుడ్ ని ప్రస్తుతం ఓ కుదుపు కుదిపేస్తోంది. ఈ సందర్భంగా శిల్పాశెట్టి చెప్పిన మాటలు నెటిజనులకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. తన భర్త గురించి అడిగితే పెళ్లికి ముందు తను ఏం చేసేవాడో తనకు తెలియదని చెప్పేసింది.
తాను గతంలో వరుస షూటింగ్ లతో చాలా బిజీగా గడిపేదాన్నని ఆ సమయంలో రాజ్ కుంద్రా ఏం చేసేవాడో తనకు తెలియదని రాజ్ కుంద్రాకు సంబంధించినవని చెబుతున్న యాప్స్ గురించి తనకు ఏమీ తెలియదని స్పష్టం చేసింది. అయితే శిల్పా సమాధానం విన్న చాలా మంది భర్త గురించి తెలియకుండానే ఇన్నేళ్లు కాపురం వెలగబెట్టావా? అంటూ దుమ్ము దులిపేస్తున్నారు.
రాజ్ కుంద్రాపై దాఖలు చేసిన 1400 పేజీల చార్జిషీట్ లో శిల్పాశెట్టి తన భర్త గురించి తనకు ఏమీ తెలియదని వాంగ్మూలం ఇవ్వడంతో ప్రస్తుతం విమర్శల పాలవుతోంది. విచారణలో తనకు ఏమీ తెలియదని చెప్పిన శిల్పా అదే విషయాన్ని మాత్రం మీడియాతో ప్రతిదీ పంచుకోడానికి నిరాకరించడం గమనార్హం. ఇదిలా వుంటే జూలై 19 నుంచి పోర్నోగ్రఫీ కేసు కారణంగా అరెస్టైన రాజ్ కుంద్రా జైల్లో వుంటున్నాడు. అతనిపై తాజాగా ముంబై శివార్లలోని వియాస్ ఇండస్ట్రీస్ పరిసర ప్రాంతాల్ని పోర్న్ వీడియోల కోసం వాడుకున్నట్టుగా పోలీసులు చార్జిషీట్ లో చేర్చడం ప్రాధాన్యతను సంతరించుకుంది.