Begin typing your search above and press return to search.

టబు బర్త్ డే.. ఎంజాయ్ చేసిన ఆ ముగ్గురు..!

By:  Tupaki Desk   |   8 Nov 2022 8:30 AM GMT
టబు బర్త్ డే.. ఎంజాయ్ చేసిన ఆ ముగ్గురు..!
X
అందాల భామ టబు రీసెంట్ గా తన 52 వసంతాలను పూర్తి చేసుకుని 53వ వసతంలోకి అడుగు పెట్టింది. తెలుగు అమ్మాయే అయినా టాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసి బాలీవుడ్ వెళ్లిన అమ్మడికి అక్కడ స్టార్ క్రేజ్ కట్టబెట్టారు బాలీవుడ్ ఆడియన్స్. ముఖ్యంగా అక్కడ ప్రేక్షకులను తన రొమాంటిక్ ఉచ్చులో పడేలా చేసింది టబు. తెలుగులో చేసిన కొన్ని సినిమాలకే ఇక్కడ కూడా హాట్ ఇమేజ్ సొంతం చేసుకోగా అది బాలీవుడ్ లో కూడా కొనసాగిస్తూ వచ్చింది. తెలుగులో చాలామంది స్టార్స్ కి ఇప్పటికీ టబు టచ్ లో ఉంటుంది.

ఇక సోమవారం టబు బర్త్ డే సందర్భంగా తన ఇంట్లో కేక్ కట్ చేసింది. ఈ పార్టీలో బాలీవుడ్ డ్యాన్సర్, డైరక్టర్ ఫరా ఖాన్ అటెండ్ అయ్యారు. ఆమెతో పాటుగా మరో హీరోయిన్ శిల్పా శెట్టి కూడా వచ్చారు. టబు బర్త్ డే పార్టీలో వీరి హంగామా ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ న్యూస్ గా మారింది. అంతేకాదు టబు బర్త్ డే సందర్భంగా పైజామా పార్టీ చేసినట్టు ఫరా ఖాన్ తన ఇన్ స్టా పేజ్ లో రాసుకొచ్చారు. టబుతో తనకు 30 ఏళ్ల అనుబంధమని అన్నారు.

ఇండియన్ హీరోయిన్స్ లో టబుకి సెపరేట్ స్టైల్ ఉంది. ఇటు మంచి అభినయంతో మెప్పిస్తూనే అదే రేంజ్ లో తన అందాలతో అలరించింది. నిన్నటితరం గ్లామరస్ బ్యూటీగా టబు తన సత్తా చాటింది. బాలీవుడ్ లో ఆమె గ్లామర్ సైడ్ చేయని ప్రయోగాలు లేవు.

ఫీమేల్ సెంట్రిక్ సినిమాలతో కూడా మెప్పించింది టబు. బాలీవుడ్ లో సెటిల్ అయిన టబు ఇప్పటికీ తెలుగు పరిశ్రమలో మంచి అవకాశం వస్తే చేస్తానని అంటుంది. టబు చివరగా తెలుగులో అల వైకుంఠపురములో సినిమాలో నటించింది.

ఇప్పుడు వస్తున్న భామలు ఇంటిమేట్ సీన్స్ లో రెచ్చిపోతున్నారు కానీ అప్పట్లోనే తన బోల్డ్ సీన్స్ తో బాక్సాఫీస్ ని షేక్ చేసింది టబు. అందుకే ఇప్పటికీ ఆమె అంటే ఇష్టపడే అభిమానులు ఉన్నారు. కథ డిమాండ్ చేస్తే తన కన్నా చిన్న వారితో కూడా రొమాన్స్ చేసేందుకు టబు రెడీ అంటుంది.

అలా తన కెరియర్ లో ఇలాంటి ప్రయోగాలు చాలా చేసింది. 53 ఏళ్లు వచ్చినా టబు ఇంకా యంగ్ హీరోలతో రొమాంటిక్ సినిమాలు చేస్తూ వస్తుంది. బాలీవుడ్ లో తనకు వచ్చిన ఈ క్రేజ్ తో మరిన్ని ప్రయోగాలు చేయాలని చూస్తుంది టబు. ప్రస్తుతం ఫరా ఖాన్ షేర్ చేసిన టబు బర్త్ డే పిక్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.