Begin typing your search above and press return to search.

సాగరంలో సాగర కన్య సంబరాలు

By:  Tupaki Desk   |   10 Sep 2015 3:55 AM GMT
సాగరంలో సాగర కన్య సంబరాలు
X
బర్త్ డేలు సెలబ్రేట్ చేసుకోవడం ఒక్కోళ్లదీ ఒక్కో స్టయిల్. బాలీవుడ్ సీనియర్ నటి శిల్పాశెట్టి.. భర్త రాజ్ కుంద్రా బర్త్ డే సందర్భంగా ఇద్దరూ కలిసి అబ్రాడ్ టూర్ వేసుకున్నారు. భూమిపై ఉన్న స్వర్గంగా పేరు పొందిన మాల్దీవులకి వెళ్లి.. వేడుకలు చేసుకున్నారు.

అనుభవించు రాజా.. ఈ పాట పాడుకోవడానికి కరెక్ట్ ప్లేస్ మాల్దీవులు. శిల్ప, రాజ్ కుంద్రాలు అక్కడికి వెళ్లిందే సంబరాలు చేసుకోడానికి.. ఇక పట్టాపగ్గాలుంటాయా చెప్పండి. ఒకటే ఎంజాయ్ మెంట్. సబ్ మెరైన్ కి వెళ్లామని,జీవితంలో ఫస్ట్ టైం పారాసెయిలింగ్ చేశానంటూ.. తన సంతోషాన్ని ట్విట్టర్ లోనూ పంచింది శిల్ప.

అన్నిటి కంటే స్పెషల్ ఏంటంటే... ఇక్కడ సముద్రంలో వేటకు వెళ్లారట శిల్ప దంపతులు. చేపలు పట్టుకున్నామని, అవి చాలా అందంగా ఉన్నాయంటోంది. సాగరకన్య చేపల వేటకి వెళ్తే... సముద్రపు అందాలన్నీ తమ రాణిని చూడ్డానికి వచ్చేసుంటాయి. వాటిని పట్టేసి ఉంటుందీ సముద్రంలో సాగరకన్య.