Begin typing your search above and press return to search.
శిల్పాశెట్టి రియల్ లైఫ్ చూపిస్తారా?
By: Tupaki Desk | 24 Sep 2015 5:23 AM GMTదక్షిణ భారతదేశం నుంచి మోడల్ గా ఎదిగి, అటుపై సినిమా నాయికగా మారి, అక్కడి నుంచి పారిశ్రామిక వేత్తగా ఎదిగిన ఓ నటి జీవితాన్ని వెండితెరపై చూపిస్తున్నాం అంటూ కేలెండర్ గాళ్స్ గురించి ప్రచారం చేస్తున్నారు. ఈ సినిమాలో ఆకాంక్ష పాత్ర శిల్పాశెట్టి నుంచి స్ఫూర్తి పొందినదేనని చెబుతున్నారు. ఐదుగురు క్యాలెండర్ గాళ్స్ లో ఒక క్యారెక్టర్ శిల్పాశెట్టిదేనని చెబుతున్నారు. ఆకాంక్ష పాత్ర శిల్పాశెట్టి రియల్ లైఫ్ కి దగ్గరగా ఉంది.
శిల్పా శెట్టి ఆరంభం కింగ్ ఫిషర్ క్యాలెండర్ గాళ్ గా పాపులరైంది. విజయ్ మాల్యా బృందంలో టాప్ మోడల్ గా కొనసాగింది. ఆ తర్వాత బాలీవుడ్ లో బాజీఘర్ సినిమాలో మీరా చోప్రా అనే క్యారెక్టర్ లో నటించింది. సాహసవీరుడు సాగరకన్య చిత్రంతో తెలుగులో తెరంగేట్రం చేసింది. వీడెవడండి బాబూ - ఆజాద్ - భలేవాడివి బాసూ వంటి సినిమాల్లో నటించింది. తమిళ్ లో మిస్టర్ రోమియో - ఖుషీ సినిమాల్లో నటించింది. ఓవైపు హిందీలో నటిస్తూనే దక్షిణాదిన కెరీర్ ని సాగించింది.
అటుపై బిజినెస్ మేన్ రాజ్ కుంద్రాతో ఎఫైర్ సాగించి చివరికి పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడింది. ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టును రాజ్ కుంద్రాతో కలిసి కొనుక్కుని బిజినెస్ లో స్పీడ్ ఫెంచింది. ఇలా చూస్తే శిల్పా జీవితంలో ఎన్నో గమ్మత్తయిన విషయాలున్నాయి. ఒక్కో మైలురాయిని అందుకుంటూ శిల్పా సాగించిన ఈ పయనాన్ని తెరపై చూపించబోతున్నాడు మధుర్ భండార్కర్. అయితే ఇది శిల్పా శెట్టి జీవితమే అని ఖరాకండిగా చెప్పడానికి మాత్రం ఎవరూ సాహసించడం లేదు.
ఇదే చిత్రంలో విజయ్ మాల్యా నిజజీవితానికి ఇన్ స్పిరేషన్ తో ఓ క్యారెక్టర్ ఉంటుందని మధుర్ చెప్పాడు. శిల్పాశెట్టి టాలీవుడ్ ఎంట్రీ, ఇక్కడ తన హవా గురించి కూడా వెండితెరపై చూపిస్తున్నారా? లేదా? అన్నది చూడాలి.