Begin typing your search above and press return to search.
రాజ్ కుంద్రా అరెస్ట్: శిల్పాశెట్టికి ఎంత నష్టమో తెలుసా?
By: Tupaki Desk | 3 Aug 2021 4:37 AM GMTబాలీవుడ్ లో రాజ్ కుంద్రా అరెస్ట్ కలకలం రేపుతోంది. అశ్లీల వీడియోల కేసులో ఆయనను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ రాకెట్ గుట్టు రట్టు అవుతోంది. ఒక్కో విషయాలు బయటపడుతూ సంచలనం సృష్టిస్తోంది. ఇక ఎప్పుడైతే రాజ్కుంద్రా ఈ అశ్లీల రాకెట్ కేసులో అరెస్ట్ అయ్యాడో.. అప్పుడే శిల్పాషెట్టి మార్కెట్ దెబ్బతినడం మొదలైందట.. ఆమె బ్రాండ్ తోపాటు ఆమె చేస్తున్న పలు కార్యక్రమాలపై కూడా ఆ ప్రభావం పడుతుందని అంతా అనుమానించారు. ఆ అనుమానాలే నిజమయ్యాయి.
రాజ్ కుంద్రా అరెస్ట్ కావడంతో శిల్పాషెట్టి తన ఆదాయాన్ని కోట్ల రూపాయల్లో కోల్పోతోంది. ప్రస్తుతం ఆమె సూపర్ డ్యాన్సూర్ ఛాప్టర్4కు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఒక్కో ఎపిసోడ్ కు శిల్పాశెట్టికి ఆమె 18 లక్షల నుంచి 22 లక్షల వరకు చార్జ్ చేస్తోంది. ఎప్పుడైతే కుంద్రా అరెస్ట్ అయ్యాడో అప్పటి నుంచి ఆమె షూటింగ్ కు రావడం లేదు. అలా మొత్తంగా ఇప్పటిదాకా.. ఈ లెక్కన శిల్పాశెట్టి ఏకంగా 2 కోట్ల రూపాయల వరకూ నష్టపోయిందని అంటున్నారు. ప్రస్తుతానికి శిల్పాశెట్టి స్థానంలో ఓ ఎపిసోడ్ కు కరిష్మాకపూర్ ను పెట్టారు. మరో ఎపిసోడ్ కు జెనీలియా-రితేష్ దేశ్ ముఖ్ వచ్చారు. ఎక్కువ రోజులు ఇలా షోను గెస్ట్ లతో నడిపించలేరు. దీంతో రాబోయే రోజుల్లోనే శిల్పాశెట్టి నిర్ణయంపై చానెల్ కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అదే జరిగితే శిల్పాకు ఆర్థికంగా చాలా నష్టం అంటున్నారు.
అయితే శిల్పాశెట్టి ఈ వ్యవహారాన్ని పక్కనపెట్టి మరో నెలరోజుల్లో షూటింగ్ కు వచ్చే అవకాశం ఉందని ఆమె సన్నిహిత వర్గాలు అంటున్నాయి. అది కూడా అప్పటికీ రాజ్ కుంద్రా కేసు ఓ కొలిక్కి వస్తేనే రావచ్చు అంటున్నారు. లేకపోతే మరిన్ని ఎపిసోడ్స్ కు ఆమె గైర్హాజరు అయ్యే అవకాశం ఉంటుంది.
అశ్లీల వీడియోల కేసులో ఈనెల 19న రాజ్ కుంద్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై అభియోగాలు నమోదయ్యాయి. ఎప్పటికప్పుడు కొత్త కొత్త విసయాలు బయటకొస్తున్నాయి. దీంతో ఈ కేసు ఇప్పట్లో తేలాల కనిపించడం లేదు. స్వయంగా పోలీసులే ఈ విషయాన్ని చెబుతున్నారు. ఇక ఈ కేసులో శిల్పాశెట్టికి ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేసిన పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదని సమాచారం.
ఈ అశ్లీల వీడియోల కేసులో శిల్పాశెట్టికి సంబంధం లేకపోయినప్పటికీ ఆమె భర్త అరెస్ట్ కావడం.. ఈమె బయటకు రాకపోవడంతో ఈమె బ్రాండ్ వాల్యూ పడిపోయే ప్రమాదంలో పడింది. ప్రస్తుతానికైతే ఆమె నష్టం టీవీ షోలకు మాత్రమే పరిమితమైంది. ఆమె బ్రాండ్ వాల్యూ ఎంత పడిపోయిందనేది రాబోయే రోజుల్లో తేలనుంది.
రాజ్ కుంద్రా వివాదంపై తాజాగా శిల్పాశెట్టి ప్రకటన చేసింది. మీడియాలో, బయటా రాజ్ కుంద్రా గురించి.. తన గురించి జరుగుతున్న ప్రచారంపై సంచలన ప్రకటన చేశారు. తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తమపై వస్తున్న పుకార్లు, ఆరోపణలను ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నారు. ఈ వివాదంపై తాను ఎవ్వరికీ వివరణ ఇవ్వడం లేదని.. తమపై అన్యాయంగా అపవాదులు వేస్తున్న కారణంగానే ఈ ప్రకటనలో తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్న శిల్పాశెట్టి రాసుకొచ్చింది.
మీడియా, సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్ లపై శిల్పాశెట్టి మండిపడింది. తమ పరువుకు నష్టం కలిగించే విషయాలను అవి ప్రచురించాయని శిల్పా శెట్టి ఆరోపించింది. ఇప్పటికే దీనిపై శిల్పా శెట్టి ముంబై హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ‘ఎప్పుడూ ఫిర్యాదు చేయవద్దు.. వివరించవద్దని’ అనుకున్నానని.. కానీ తమపై చేస్తున్న చెడు ప్రచారానికి బయటకొచ్చానని వివరించింది.
శిల్పాశెట్టి జారీ చేసిన ప్రకటనలో ‘అవును.. కొన్ని రోజులుగా ప్రతి రోజు సవాల్ గా మారింది. చాలా పుకార్లు, ఆరోపణలు తమపై వస్తున్నాయి. మీడియా ప్రచారం వల్ల తమ శ్రేయోభిలాసులు కూడా తమకు దూరంగా జరుగుతున్నారని శిల్పాశెట్టి వాపోయింది. నాకు మాత్రమే కాకుండా నా కుటుంబానికి కూడా చాలా ట్రోలింగ్/ప్రశ్నలు ఎదురవుతున్నాయని తెలిపింది. నా స్టాండ్ నేను తీసుకుంటున్నానని.. ఎవరినీ కామెంట్ చేయడం లేదని.. ఈ కేసుపై పోరాడుతానని శిల్పాశెట్టి పేర్కొంది. కాబట్టి దయచేసి నా తరుఫున తప్పుడు ప్రచారాలను ఇప్పటికైనా ఆపివేయండని శిల్పాశెట్టి పేర్కొంది.