Begin typing your search above and press return to search.

బాలీవుడ్‌ హీరోయిన్‌ కు తప్పని జాతి వివక్ష..!

By:  Tupaki Desk   |   24 Sep 2018 1:43 PM GMT
బాలీవుడ్‌ హీరోయిన్‌ కు తప్పని జాతి వివక్ష..!
X
ఈమద్య కాలంలో విదేశాల్లో ఇండియన్స్‌ జాతి వివక్షను ఎదుర్కొంటున్న వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. అమెరికా మరియు ఆస్ట్రేలియాల్లో జాతి వివక్ష హత్యలు కూడా జరుగుతున్నాయి. తాజాగా బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ శిల్పా శెట్టి కూడా ఆస్ట్రేలియాలో జాతి వివక్షను ఎదుర్కొన్నట్లుగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. తన రంగు చూసి సిడ్నీ విమానాశ్రయ మహిళ ఉద్యోగి తనను అవమానించే విధంగా ప్రవర్తించింది అంటూ ఆవేదన వ్యక్తం చేసింది - తన ఆవేదనను ఇన్‌ స్టాగ్రామ్‌ లో అభిమానులతో షేర్‌ చేసుకుంది.

ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న శిల్పా శెట్టి సిడ్నీ నుండి మెల్‌ బోర్న్‌ వెళ్లేందుకు సిడ్నీ విమానాశ్రయంకు వెళ్లింది. అక్కడ కు రెండు బ్యాగులతో వెళ్లిన శిల్పాశెట్టిని మహిళ అధికారి లోనికి పంపేందుకు నిరాకరించిందట. ఒక బ్యాగు మోతాదుకు మించి ఎక్కువ బరువు ఉన్న కారణంగా పక్కకు వెళ్లాల్సిందిగా సూచించిందట. పలు సార్లు ఆ బ్యాగ్‌ పరిశీలించాల్సిందిగా ఆమె వద్దకు వెళ్లినా కూడా ఆమె మాత్రం నిరాకరించిందని శిల్పా ఆవేదన వ్యక్తం చేసింది.

ఫ్లైట్‌ టైం మించిపోతున్న సమయంలో ఎక్కువ పరిమాణం ఉండే లగేజీని పరిశీలించే అధికారి వద్దకు వెళ్లాను. అక్కడ లగేజీని పరిశీలించి మోతాదుకు మించి ఏమీ లేదని - ఇబ్బంది లేకుండా తీసుకు వెళ్లవచ్చని చెప్పడం జరిగింది. ప్రయాణికులతో మర్యాదగా వ్యవహరించక పోవడంతో పాటు - జాతి వివక్షను చూపించిన ఆ అధికారినితో పాటు - విమానాశ్రయ సిబ్బందికి ప్రయాణికులతో ఎలా ప్రవర్తించాలో శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని శిల్పా శెట్టి ఆగ్రహంతో అన్నది.