Begin typing your search above and press return to search.
మీడియాపై కస్సుమంటున్న హీరోయిన్
By: Tupaki Desk | 17 Jun 2016 5:30 PM GMTమీడియా కనిపిస్తే చాలు... కస్సుబుస్సులాడుతోంది ఆ హీరోయిన్. లేనిపోనివి రాస్తున్నారంటూ బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు... శిల్పాశెట్టి. సౌత్ నుంచి నార్త్ వరకు ఒక ఊపు ఊపేసిన అందం ఆమెది. పారిశ్రామికవేత్త రాజ్ కుంద్రాని పెళ్లి చేసుకొని సినిమాలకి దూరమైంది. జనం పూర్తిగా మరిచిపోతే కష్టమని భావించిన శిల్పా అప్పుడప్పుడు అరకొర సినిమాలు చేస్తూ మెరుస్తుంటుంది. అలాంటి శిల్పా ఇటీవల వరసబెట్టి సినిమాల్ని ప్లాన్ చేస్తోంది. తనకి పరిచయమున్న దర్శకుల్నందరినీ సంప్రదిస్తూ తనకి ఆఫర్ ఉంటే ఇవ్వండని అడుగుతోందట. ఇప్పటికీ గ్లామర్ మెంటైన్ చేస్తుండటంతో ఆమెకి దర్శకులు కూడా ఆఫర్లు ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు.
ఇటీవలే మూడు నాలుగు సినిమాలకి సంతకం చేసిందట. నటనపై మళ్లీ మోజు పెరిగిందని, మంచి అవకాశాలొస్తున్నాయి కాబట్టే కొత్తగా సినిమాలు ఒప్పుకొంటున్నానని ఆమె చెబుతోంది. మీడియాలో మాత్రం రాజ్ కుంద్రాకీ - శిల్పాకీ మధ్య విభేదాలు చోటు చేసుకొన్నాయనీ, ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారనీ... ఆ కారణం చేతనో మళ్లీ శిల్పా సినిమాలతో బిజీ అయ్యేందుకు ప్లాన్ చేసుకొందని వార్తలొచ్చాయి. వాటిని చూసినప్పట్నుంచి శిల్పా మీడియాపై అంతెత్తున ఎగిరిపడుతోంది. లేనిపోనివి ఎందుకు రాస్తున్నారంటే బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అయితే వైవాహిక జీవితం గురించి అటు రాజ్ కుంద్రాకానీ, ఇటు శిల్పాకానీ నోరు మెదపడం లేదు.