Begin typing your search above and press return to search.

చేపను పట్టుకుంటే క్లాసు పీకారు

By:  Tupaki Desk   |   1 May 2018 12:02 PM GMT
చేపను పట్టుకుంటే క్లాసు పీకారు
X
చేతిలో స్మార్ట్ ఫోన్ లక్షల్లో ఫాలోయర్స్ ఉన్నారు కదాని సెలబ్రిటీలు ఏది పడితే అది పోస్ట్ చేస్తే అభిమానులు సైతం సైలెంట్ గా ఉండే రోజులు పోయాయి. వాళ్ళ ప్రతి చర్యను గమనిస్తూ ఏదైనా తేడా ఉంటె చాలు అంతకంతా చీల్చి చెండాడుతున్నారు. శిల్పా శెట్టికి ఇది బాగా అనుభవం అవుతోంది. ఇటీవలే హాలిడే వెకేషన్ కోసం మాల్దీవ్స్ కు వెళ్ళిన శిల్పా శెట్టి అక్కడ ఒక గేలానికి సరదాగా చేపను పట్టి ఫోటోలు దిగింది. ఊరికే ఉంటే వాటికి అర్థం ఏముంది. వెంటనే తన సోషల్ మీడియా ఎకౌంటులో షేర్ చేసేసింది. అందులో గేలానికి చిక్కుకున్న చేప గిలగిలలాడుతూ ఉంటే శిల్పా శెట్టి సరదాగా నవ్వుతు ఉండటాన్ని తప్పుబడుతూ అది చూసిన వాళ్ళు మాటల దాడి మొదలు పెట్టారు. ఇదేమి పైశాచికత్వం, చేపను తినాలి అనిపిస్తే తినాలి కాని ఇలా దాని ప్రాణంతో ఆడుకోవడం ఏంటని బాణాలు ఎక్కుపెట్టారు. చిన్నగా ఇది వైరల్ కావడంతో శిల్పా స్పందించక తప్పలేదు.

నిజానికి శిల్పా మీద ఇన్ని విమర్శలు రావడానికి కారణం తను పెటా సభ్యురాలు కావడమే. జంతు ప్రాణరక్షణ కోసం ఏర్పడ్డ ఆ సంస్థలో భాగంగా ఉంటూ మూగ జీవమైన చేపతో ఇలా ఆడుకుంటావా అనేదే ఆమె మీద ప్రధానంగా వచ్చిన విమర్శ. దీనికి శిల్పా శెట్టి బదులు ఇచ్చింది. తనకు ఎటువంటి దురుద్దేశం లేదని ఆ చేపను సరదాగా పట్టుకుని తర్వాత సముద్రంలోకి వదిలేశామని చెప్పిన శిల్పా శెట్టి తాను పూర్తి శాఖాహారినని చెప్పి ఫైనల్ ట్విస్ట్ ఇచ్చేసింది. ఇదంతా చూసాక స్టిల్స్ కోసమో లేదా లైకుల కోసమో మనం పెట్టే ఫోటోలు ఎలాంటి పరిస్థితికి దారి తీస్తాయో అర్థమయ్యిందిగా.దెబ్బకు శిల్పా శెట్టి ఇకపై అలోచించి పెట్టే పరిస్థితి వచ్చేసింది పాపం.