Begin typing your search above and press return to search.
రాజ్ కుంద్రా ప్లాన్ బి: వాళ్లే టార్గెట్.. వాట్సాప్ చాట్ లీక్
By: Tupaki Desk | 31 July 2021 4:30 PM GMTఅశ్లీల చిత్రాలు తీసిన కేసులో అరెస్ట్ అయిన రాజ్ కుంద్రా కేసులో ఒక్కొక్కటిగా విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఆయన భార్య, ప్రముఖ నటి శిల్పాశెట్టిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. రాజ్ కుంద్రా కేసులో ఏదో ఒక విషయం బయటపడుతూ సంచలనం అవుతోంది.
పోలీసుల విచారణలో రాజ్ కుంద్రా ఎక్కువగా ఒక వర్గం మోడల్స్ ను టార్గెట్ చేసి ఈ రొంపిలోకి లాగేవాడని తేలినట్టు ముంబైలో కథనాలు వెలువడుతున్నాయి. భారత్ లో ఈ అశ్లీల వీడియోలపై ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు చెక్ పెట్టినప్పటికీ ఇలా చాటుమాటుగా వీడియోలు తీశారని తేలింది. గత రెండు మూడేళ్లలో అశ్లీల వీడియోల హవా ఎక్కువగా పెరిగిపోయింది. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని టార్గెట్ చేస్తున్నారని తెలిసింది.
అశ్లీల కంటెంట్ తో సినిమాలను నిర్మించే వ్యవహారంలో రాజ్ కుంద్రాతో పనిచేసే సిబ్బంది, బిజినెస్ పార్ట్ నర్స్ అందరూ కలిసి ‘హెచ్’ అకౌంట్ అనే పేరుతో వాట్సాప్ గ్రూప్ ను క్రియేట్ చేశారు. ఆ గ్రూపులోనే అశ్లీల చిత్రాల గురించి చర్చించుకొనే వారని తెలిసింది. అలాగే భవిష్యత్ ప్రణాళికలను ఒకరినొకరు చర్చించుకునే వారు అనే విషయం బయటకు వచ్చింది.
అయితే రాజ్ కుంద్రా రూపొందించిన హాట్ షాట్స్ అనే యాప్ ను తొలగిస్తూ గూగుల్ ప్లే స్టోర్ నిర్ణయం తీసుకోవడంతో బిజినెస్ పార్ట్ నర్లు ప్లాన్ బీ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. హాట్ షాట్స్ తొలగించిన నేపథ్యంలో మరో 3 వారాల్లో కొత్త యాప్ ను తయారు చేసి మరో చానెల్ ను ప్రారంభించాలని ప్లాన్ చేసినట్టు వాట్సాప్ చాట్ బయటపడింది.
అయితే షాట్ షాట్ కాకుండా మరో యాప్ తయారు చేయాలన్న ప్రతిపాదనను తన వ్యాపార భాగస్వామి రాబ్ డిజిటల్ మార్కెటింగ్ సభ్యులు వ్యతిరేకించారట. కొత్త యాప్ ను తయారు చేయడానికి బదులు హాట్ షాట్స్ లో ఉండే అన్ని బోల్డ్ చిత్రాలను డిలీట్ చేసి మళ్లీ గూగుల్ ప్లే స్టోర్ ను రివ్యూ అడుగుదామని.. హాట్ షాట్స్ యాప్ ను కొనసాగిద్దాం అని సూచించినట్టు వాట్సాప్ చాట్ లో వెలుగుచూసింది.
ముంబైలో కొంతమంది మోడల్స్ ను ఇలాగే వేశ్యలతో అశ్లీల వీడియోలను షూట్ చేశారని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వారు దొరికితే వారితో కొన్ని నెలల పాటు డీల్ సెట్ చేసుకునే అవకాశం కూడా ఉందన్నారు.హీరోయిన్ పూనమ్ పాండే కూడా ఈ హాట్ షాట్స్ యాప్ కోసం అలాంటి ఆఫర్ తోనే లోబరుచుకునే ప్రయత్నం చేశారని వార్తలు వస్తున్నాయి. కానీ ఆమె డైరెక్టుగానే రాజ్ కుంద్రాపై పోలీస్ కేసు నమోదు చేసింది.
తాజాగా ముంబై క్రైం బ్రాంచ్ బృందం మరోసారి శిల్పాశెట్టి -రాజ్ కుంద్రా నివాసానికి చేరుకొని సోదాలు చేస్తున్నట్టు సమాచారం ఈ సోదాల్లో దాదాపు 100కు పైగా అశ్లీల వీడియోల డేటా లభించినట్లు తెలుస్తోంది. ఇక వాటికి ఖర్చు కూడా తక్కువగానే పెట్టారని విచారణలో తేలిందట..ఇ క కేసును మరింత సీరియస్ గా ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు తీసుకున్నారు. అధికారులు ఏమాత్రం పట్టువిడవడం లేదు.
రాజ్ కుంద్రా ఇంట్లో అలాగే అతడి సన్నిహితుల ఇంట్లో కూడా మరికొన్ని రోజుల వరకూ సోదాలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.రాజ్ కుంద్రా బిజినెస్ అసోసియేట్ ర్యాన్ తోర్పేను శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు. మూడు రోజుల పాటు పోలీసు రిమాండ్ ముగియడంతో ప్రవేశపెట్టారు.
కేసు విషయంలో మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి పోలీసులు తమ కస్టడీని పొడిగించాలని కోరగా అందుకు న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
సన్నిహితులు ఫామ్ హౌస్ లను అలాగే చిన్నపాటి హోటల్స్ లలో అశ్లీల చిత్రాలు షూటింగ్ చేసి యాప్స్ లో విడుదల చేస్తున్నారట.. దీంతో నిర్మాతలు భారీ లాభాలను అందుకున్నారని తెలుస్తోంది.