Begin typing your search above and press return to search.
మరోసారి వార్తల్లో నిలిచిన శిల్పాశెట్టి: 28న కోర్టుకు హాజరు కావాలని సమన్లు
By: Tupaki Desk | 13 Feb 2022 7:50 AM GMTబాలీవుడ్ నటి శిల్పాశెట్టి మరో వివాదంలో చిక్కుకుంది. ఆమెతోపాటు ఆమె చెల్లి, తల్లికి కోర్టు సమన్లు పంపింది. ఓ వ్యాపార వేత్త తన దగ్గర తీసుకున్న అప్పు చెల్లించలేదని కోర్టును ఆశ్రయించడంతో కోర్టు శిల్పాశెట్టి కుటుంబ సభ్యులకు సమన్లు పంపింది. ఈనెల 28న కోర్టుకు హాజరు కావాలని ఇందులో కోర్టు పేర్కొంది.
అయితే గత కొన్ని నెలల కిందట శిల్పాశెట్టి తన భర్త కేసు వ్యవహారంలో వార్తల్లోనిలిచింది. తాజాగా మరోసారి ఆమె తండ్రిచేసిన అప్పు విషయంలో శిల్పాశెట్టి గురించి న్యూస్ చక్కర్లు కొడుతోంది. అయితే ఇప్పటి వరకు శిల్పా శెట్టి ఏ విధంగా స్పందించలేదు. కానీ ఈనెల 28న కోర్టుకు హాజరు నేపథ్యంలో శిల్పా స్పందన ఏంటనేది అసక్తిగా మారింది.
పర్హాత్ అమ్రా అనే వ్యాపార వేత్త జూహు పోలీస్ట్ స్టేషన్లో ఇటీవల శిల్పాశెట్టి తండ్రిపై పిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ప్రకారం 2015లో శిల్పాశెట్టి తండ్రి సురేంద్ర శెట్టి 21 లక్షల రుణాన్ని పర్హాత్ వద్ద తీసుకున్నాడు. అయితే ఈ అప్పును 2017లో చెల్లించాల్సి ఉంది. కానీ సురేంద్ర 2016 అక్టోబర్ 11న మరణించారు. కానీ ఆ అప్పును ఇప్పటి వరకు కుటుంబ సభ్యులు చెల్లించలేదు. పైగా రుణం కోసం సంప్రదిస్తే చెల్లించడానికి నిరాకరిస్తున్నారు. దీంతో ఆయన జూహు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
సురేంద్ర చేసిన అప్పు కూతురు, తల్లికి తెలుసునని ఆ వ్యక్తి తెలిపారు. అయినప్పటికీ వారు డబ్బు తిరిగి ఇచ్చేందుకు నిరాకరిస్తున్నట్లు ఆరోపించారు. సురేంద్ర శెట్టి 18 శాతం వార్షిక వడ్డీకి రుణం తీసుకున్నట్లు తెలిపారు. కాగా ఈ కేసు అంధేరీ కోర్టుకు వెళ్లడంతో శిల్పాశెట్టి, ఆమె సోదరి షమితా శెట్టి, తల్లి సునందలకు సమన్లు పంపారు. ఈ నెల 28న వీరంతా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించారు.
వరువ వివాదాలతో శిల్పాశెట్టి వార్తల్లో నిలుస్తోంది. గతేడాది శిల్పా భర్త రాజ్ కుంద్రా నీలి చిత్రాల కేసులో అరెస్టయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శిల్పాశెట్టిని కూడా పోలీసులు విచారించారు. అయితే ఆ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. అంతేకాకుండా తన భర్త రాజ్ కుంద్రా అమాయకుడని పేర్కొంది.
అయితే అంతకుముందు కొందరు నటులు తమకు సినిమాల్లో అవకాశం ఇస్తానని చెప్పిబోల్డ్ చిత్రాల్లో నటించాలని రాజ్ కుంద్రా ఒత్తిడి చేశారని ఆరోపించారు. కొందమంది పోలీసులను ఆశ్రయించడంతో రాజ్ కుంద్రాను అరెస్టు చేశారు. కొన్ని రోజుల పాటు కస్టడీ తీసుకొని విచారించారు. అయితే రాజ్ కుంద్రా బెయిల్ పై బయటికి వచ్చారు.
ఇక శిల్పా శెట్టి భర్త వ్యవహారంతో తీవ్ర మనస్థాపానికి గురైంది. రాజ్ కుంద్ర వ్యవహారం బయటికి రావడంతో శిల్పా కొన్ని రోజుల పాటు మీడియాలో, టీవీ షోల్లోకనిపించలేదు. అయితే ఆ తరువాత టీవీ షో ల్లోకి వస్తున్నారు. ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో భర్త రాజ్ కుంద్రాపై కొందరు ప్రశ్నలు వేస్తున్నా ఎలాంటి సమాధానం చెప్పకుండా దాట వేస్తున్నారు.
అయితే తాజాగా తండ్రి చేసిన అప్పుల వ్యవహారంలో శిల్పా పేరు ఉండడంతో మరోసారి చర్చనీయాంశంగా మారింది. మరోవైపు సమన్లు అందుకున్న షమితా శెట్టి సైతం కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. తెలుగులోనూ 'పిలిస్తే పలుకుతా' సినిమాలో నటించిన షమితా ఆ తరువాత సినిమాల నుంచి తప్పుకుంది. అయితే ఈనెల 28న వీరు కోర్టుకు హాజరవుతారా..? లేదా..? అనే విషయంపై సోషల్ మీడియాలోజోరుగా చర్చ సాగుతోంది. ఒకవేళ కోర్టులో ఎలాంటి సమాధానం ఇస్తారోనని ఎదురుచూస్తున్నారు.