Begin typing your search above and press return to search.
స్లిమ్ అవ్వడానికి మందు బిళ్లలా.. ఛీఛీ పొమ్మంది!
By: Tupaki Desk | 17 Aug 2019 2:30 PM GMTజనాల్ని గుడ్డిగా నమ్మించి ఉత్పత్తుల్ని అమ్మేయడంలో కార్పొరెట్ కంపెనీల గజకర్ణ గోకర్ణ విద్యల గురించి తెలిసిందే. కష్టపడకుండా ఒళ్లు తగ్గిస్తామని.. పొట్టను.. ఒంట్లో కొవ్వును కుదించేస్తామని రకరకాల ప్రచారంతో మెడికల్ ఉత్పత్తుల్ని అమ్మేయడం చూస్తున్నదే. అయితే ఇలాంటి అసహజ విధానాల వల్ల పుట్టుకొచ్చే కొత్త రుగ్మతల గురించి ఫిట్ నెస్ అండ్ వెల్ నెస్ డాక్టర్లు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
ఇకపోతే బాలీవుడ్ ఫిట్ నెస్ దేవత శిల్పాశెట్టి ఎందరికో ఫిట్ నెస్ విషయంలో స్ఫూర్తి. యోగా - ధ్యానం- జిమ్ వంటివి నిరంతరం క్రమం తప్పక పాటిస్తూ రెగ్యులర్ ఫిట్ నెస్ ఫ్రీక్ గా అందరికీ స్ఫూర్తిని నింపుతున్నారు. ఆరోగ్యం.. ఫిట్ నెస్ విషయాల్లో ప్రతి ఒక్కరూ శిల్పా శెట్టినే ఆదర్శంగా భావిస్తుంటారు. అంతటి పాపులారిటీ ఉన్న స్టార్ కాబట్టే శిల్పాజీ ప్రారంభించిన ఫిట్ నెస్ యాప్ లకు జనాదరణ విశేషంగా ఉంది. అయితే సరిగ్గా ఇదే పాయింట్ ని ఓ ఆయుర్వేదిక్ ఉత్పత్తుల సంస్థ క్యాష్ చేసుకోవాలనుకుంది. అందుకోసం తమ ఉత్పత్తి బ్రాండ్ ప్రమోషన్ కోసం 10 కోట్లు ఆఫర్ చేసిందట.
తమ బ్రాండ్ ఆయుర్వేదిక్ స్లిమ్మింగ్ పిల్స్ (మందు బిళ్లలు)కు శిల్పాజీ యాప్ లో ప్రమోషన్ చేస్తే చాలు. ఆ అడ్వర్టయిజ్ మెంట్ క్యాంపెయినింగ్ కి అంత పెద్ద మొత్తాన్ని చెల్లిస్తామని ఆఫర్ చేసారట. అయితే ఈ ఆఫర్ ని శిల్పాశెట్టి తిరస్కరించారని తెలుస్తోంది. ఒక స్ట్రిక్ట్ యోగా ప్రాక్టీషనర్ గా ఇలాంటి వాటిని శిల్పాజీ నమ్మరు. అందుకే సదరు కార్పొరెట్ కంపెనీ ఇచ్చిన ఆఫర్ ని కాదనుకున్నారు. తాను నమ్మని ఉత్పత్తికి ప్రచారం చేసే అలవాటు శిల్పా శెట్టికి లేనేలేదు. అందుకే వద్దనుకున్నారట. అయినా బరువు తగ్గేందుకు శారీరక శ్రమ లేకుండా మందు బిళ్లలు మింగితే సరిపోతుందా? దానికంటే జీవన శైలిని మార్చుకోవడం ఉత్తమమని శిల్పా శెట్టి ఇప్పటికే ప్రచారం చేస్తూనే ఉన్నారు. అలాంటిది ఇప్పుడిలా మందు బిళ్లలు అంటూ కొత్త పల్లవి అందుకుంటే ఆ మేరకు ఫిట్ నెస్ గాడెస్ గా తనకు వచ్చిన ఇమేజ్ కి తీవ్రమైన డ్యామేజీ తప్పేది కాదేమో!