Begin typing your search above and press return to search.

తుఫాన్ తర్వాత ప్రశాంతత: రాజ్ కుంద్రా బెయిల్ పై స్పందించిన శిల్పాశెట్టి

By:  Tupaki Desk   |   22 Sep 2021 2:30 AM GMT
తుఫాన్ తర్వాత ప్రశాంతత: రాజ్ కుంద్రా బెయిల్ పై స్పందించిన శిల్పాశెట్టి
X
అశ్లీల చిత్రాల వీడియోలు తీశాడని ఆరోపిస్తూ జూలై 19న రాత్రి అరెస్ట్ అయిన రాజ్ కుంద్రాకు ఎట్టకేలకు హైకోర్టులో బెయిల్ మంజూరు అయ్యింది. ఈరోజు ఆయన విడుదలయ్యారు. ఈ వార్త వెలువడిన వెంటనే ఆయన భార్య, ప్రముఖ నటి శిల్పాశెట్టి తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా మొదటి సారి స్పందించారు. అందమైన కొటేషన్ తో పరోక్షంగా స్పందించారు.

గత కొంతకాలంగా సోషల్ మీడియాలో కూల్ గా కనిపస్తున్న శిల్పా శెట్టి 'కఠిన సమయంలోనే మనం బలం ఏమిటో తెలుస్తోందని' ఇటీవల పోస్ట్ చేశారు. సోమవారం రాజ్ కుంద్రాకు బెయిల్ రాగానే మరో పోస్ట్ పెట్టారు. ఆయన రియాక్షన్ వైరల్ గా మారింది.

రాజ్ కుంద్రా బెయిల్ పిటీషన్ పై సోమవారం ముంబై కోర్టులో విచారణ జరిగింది. ఆయన తరుఫున న్యాయవాది ప్రశాంత్ పాటిల్ వాదనలు వినిపించారు. రాజ్ కుంద్రా చార్జ్ షీట్ లో అశ్లీల కంటెంట్ ను ఆయనే ఆన్ లైన్ లో అప్ లోడ్ చేశారనే దానికి ఎటువంటి ఆధారాలు లేవు అని పేర్కొన్నారు. రాజ్ కుంద్రాను తప్పుడు కేసులో ఇరికించి బలిపశువును చేశారని ఆరోపించారు. ఎఫ్ఐఆర్ లో రాజ్ కుంద్రా పేరు కూడా లేదని.. అయినప్పటికీ అతడిని కేసులోకి లాగారని ఆరోపించారు.

గత గురువారం ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు ఈ కేసులో రాజ్ కుంద్రాపై చార్జిషీట్ దాఖలు చేయగా.. శనివారం అతడు బెయిల్ పిటీషన్ ను దాఖలు చేశారు. గతంలో హైకోర్టు రాజ్ కుంద్రా బెయిల్ పిటీషన్ ను తిరస్కరించింది. తాజాగా ముంబై కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో రాజ్ కుంద్రాకు భారీ ఊరట లభించింది. ఈరోజు కుంద్రా జైలు నుంచి విడుదలయ్యారు.

'చెడు తుఫాన్ తర్వాత అందమైన విషయాలు జరగవచ్చని.. అది నిరూపించడానికి ఇంధ్రధనస్సు ఉనికిలో ఉంది' అని రాజ్ కుంద్రా బెయిల్ తర్వాత ఓ మంచి కొటేషన్ ను శిల్పాశెట్టి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక కుంద్రా తాజాగా బెయిల్ దరఖాస్తులో తనను 'బలిపశువు' చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.