Begin typing your search above and press return to search.
శిల్పా శెట్టి డిసైడైపోయిందా?
By: Tupaki Desk | 31 Aug 2021 3:08 AM GMTరెండు నెలల ముందు వరకు బాలీవుడ్ భామ శిల్పా శెట్టిని చూసి చాలామంది అసూయ పడేవాళ్లు. కెరీర్ అయిపోయిందనుకున్న దశలో ‘బిగ్ బ్రదర్’ షోతో వరల్డ్ వైడ్ పాపులారిటీ సంపాదించడం.. ఆ తర్వాత ఐపీఎల్ జట్టుకు సహ యజమాని కావడం పెద్ద బిజినెస్ మ్యాన్ అయిన రాజ్ కుంద్రాను పెళ్లాడటం.. టీవీ షోలు, కమర్షియల్స్‌తో కొత్త కెరీర్ నిర్మించుకోవడం.. ఇవన్నీ చూసి ఆమె తరం హీరోయిన్లు అసూయపడేవాళ్లు. కానీ గత నెలన్నర రోజుల్లో జరిగిన పరిణామాలతో అంతా మారిపోయింది. నిబంధనలకు విరుద్ధంగా ఇండియాలో పోర్న్ మూవీస్ తీసి కోట్లు కొల్లగొడుతున్నాడన్న ఆరోపణలతో అతను అరెస్టవడంతో శిల్పా కుటుంబ ప్రతిష్ఠ బాగా దెబ్బ తినేసింది.
తను చేస్తున్న వివిధ కార్యక్రమాలు, ఎండోర్స్మెంట్స్ నుంచి శిల్పా తప్పుకోవాల్సి వచ్చింది. భర్త వల్ల శిల్పా తలదించుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ పరిణామాలపై నర్మగర్భంగా రెండుసార్లు సోషల్ మీడియా పోస్టులు పెట్టింది కానీ.. అంతకుమించి ఏమీ మాట్లాడలేదు శిల్పా. ఏం జరిగినా పట్టించుకోకుండా భర్తతోనే కొనసాగుతుందనే అనుకున్నారు. కానీ తాజా పరిణామాలు చూస్తుంటే ఆ అంచనాలు తప్పేలా కనిపిస్తున్నాయి. భర్త నుంచి శిల్పా విడిపోతుందనే సంకేతాలు వస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
తాజాగా శిల్పా షేర్ చేసిన సోషల్ మీడియా పోస్ట్.. రాజ్ కుంద్రా నుంచి ఆమె దూరం జరగబోతోందనే ఆలోచన కలిగిస్తోంది. ‘‘తప్పులు అందరూ చేస్తారు కానీ ఆ తప్పులు భయంకరంగా, ఇతరులను బాధించేలా ఉండకూడదు’’ అని ఉంది ఆ పోస్టులో. అంతే కాక ‘‘తప్పు చేశాను కానీ వాటిని సరిదిద్దుకుంటాను’’ అని కూడా ఆ పోస్టులో పేర్కొనడంతో సందేహాలు కలుగుతున్నాయి.
రాజ్ కుంద్రాను పెళ్లాడమే తాను చేసిన తప్పని.. అతడి నుంచి విడిపోవడం ద్వారా ఆ తప్పును దిద్దుకుంటానని శిల్పా సంకేతాలు ఇస్తోందని నెటిజన్లు విశ్లేషిస్తున్నారు. ఈ వివాదానికి ముందు నుంచే రాజ్‌తో శిల్పాకు కొన్ని గొడవలు ఉన్నాయని.. కాగా పోర్న్ మూవీస్ తీశాడన్న ఆరోపణలతో కుటుంబ పరువును అతను బజారున పడేయడంతో ఇక తాను అతడితో కొనసాగడం కష్టమన్న అభిప్రాయానికి శిల్పా వచ్చేసిందని బాలీవుడ్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. శిల్పా నిజంగా ఈ నిర్ణయం తీసుకుంటే మాత్రం రాజ్ కుంద్రా పరిస్థితి దారుణంగా మారబోతున్నట్లే.