Begin typing your search above and press return to search.

#క‌ష్టంలో సుఖం: ప్రాణాయామంతో ఒత్తిడిని జ‌యిస్తున్న శిల్పా శెట్టి

By:  Tupaki Desk   |   16 Aug 2021 10:30 AM GMT
#క‌ష్టంలో సుఖం: ప్రాణాయామంతో ఒత్తిడిని జ‌యిస్తున్న శిల్పా శెట్టి
X
నీలిచిత్రాల యాప్ ల నిర్వాహ‌కుడిగా నిరూప‌ణ అయినందున శిల్పాశెట్టి భ‌ర్త‌ రాజ్ కుంద్రాను పోలీసులు అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత నిజానిజాలు తేలే వ‌ర‌కూ త‌న‌ గోప్య‌త‌ను కాపాడాల్సిందిగా మీడియాను శిల్పాజీ అభ్య‌ర్థించారు. కొన్ని మీడియాల‌పై కేసులు కూడా పెట్టారు. కానీ మీడియా స్వేచ్ఛ‌ను హ‌రించ‌లేమ‌ని కోర్టు తీర్పు వెలువ‌డింది.

భ‌ర్త అరెస్టు అనంత‌రం మీడియాకు దూరంగా ఉన్న కొన్ని రోజుల తర్వాత నటి శిల్పా శెట్టి మొదటి వర్చువల్ వీడియోలో కనిపించింది. ఆన్ లైన్ అప్లికేషన్ ల ద్వారా వయోజన చిత్రాల తయారీ ప్రచురణలో జోక్యం చేసుకున్నందుకు జూలై 19న కుంద్రాని పోలీసులు అరెస్టు చేశారు. రాజ్ కుంద్రా ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

ఇక తాజా వ‌ర్చువ‌ల్ ఈవెంట్ లో శిల్పా ఫిట్ నెస్ ఔత్సాహికురాలు గా ప్ర‌త్య‌క్ష‌మైంది. శ్వాస వ్యాయామాలు ఎలా చేయాలో ఆమె ప్రదర్శించింది. అంతా శ్వాస మీద ఆధారపడిన కాలంలో మనం జీవిస్తున్నామని ఆమె చెప్పింది. ఇది మన శ్వాస ప్రక్రియ ద్వారా మన మొత్తం వ్యవస్థను కాపాడుతుంది. ఎవరైనా వారి నాసికా మార్గాన్ని శుభ్రంగా ఉంచుకుంటే స్వయంచాలకంగా ఆక్సిజన్ మెదడు కణాలకు సరిగ్గా చేరుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.. అని వెల్ల‌డించింది. స్వ‌యంగా ఆమె ప్రక్రియను కూడా ప్రదర్శించింది.

మనల్ని మనం పాజిటివ్ గా ఉంచుకోవడం .. ప్రతికూల ఆలోచనలను దూరంగా ఉంచడం ఎందుకు అవసరమో శిల్పా చెప్పింది. మ‌నం సమస్యల్లో ఉన్నప్పుడు అన్ని రకాల ఆలోచనలు మన మనస్సులో ముఖ్యంగా ప్రతికూలంగా వస్తాయి. కానీ మనం కోరుకుంటే వాటిని నియంత్రించవచ్చు. అందుకే సానుకూల ఆలోచనలను ఉంచడానికి మీ శ్వాసను నియంత్రించడం చాలా ముఖ్యం. అందుకే సానుకూలంగా ఉండటానికి శ్వాసను మెరుగుపరచడానికి ప్రాణాయామం అంతర్భాగంగా మారింది`` అని తెలిపారు.

శిల్పాజీ ఇటీవల ఒక ప్రకటనను విడుదల చేసారు, “గత కొన్ని రోజులుగా స‌వాళ్లు ఎదుర‌య్యాయి. చాలా పుకార్లు ఆరోపణలు ఉన్నాయి. మీడియా శ్రేయోభిలాషులు కూడా నాపై చాలా అవాంఛనీయ రాత‌లురాసారు.. నాకు మాత్రమే కాకుండా నా కుటుంబానికి కూడా చాలా ట్రోలింగ్ ప్రశ్నలు ఎదురయ్యాయి. నా విధానం ఏమిటి అంటే... నేను ఇప్పుడు కామెంట్ చేయలేను. ఈ కేసులో అలా చేయడం మానుకున్నాను. ఎందుకంటే ఇది అన్యాయంగా ఉంది కాబట్టి దయచేసి నా తరపున తప్పుడు వార్త‌లు ఆపాదించడాన్ని ఆపివేయండి. ఎప్పుడూ ఫిర్యాదు చేయవద్దు... వివరించవద్దు.. అనే నా తత్వాన్ని పునరుద్ఘాటిస్తున్నాను. నేను చెప్పేది ఏమిటంటే.. ఇది కొనసాగుతున్న దర్యాప్తు కాబట్టి,.. నాకు ముంబై పోలీసులు .. భారతీయ న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది”. ఈ విషయం విచారణలో తేలాల్సి ఉంది.. అని శిల్పాశెట్టి అన్నారు.

యాప్ ల దందా విలువ వంద‌ల కోట్లు

నీలి చిత్రాల దందాలో శిల్పా శెట్టి భ‌ర్త‌ రాజ్ కుంద్రా లోగుట్టు బ‌య‌ట‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. వీడియో యాప్ ల పేరుతో మ‌గువ‌ల‌ను వ‌ల‌లో వేసే వ్యాపారం గుట్టు ర‌ట్ట‌య్యింది. వంద‌ల కోట్ల బిజినెస్ గుట్టు ర‌ట్ట‌వ్వ‌డంతో ఆయ‌న వ‌ల్ల వేధింపుల‌కు గురైన న‌టీమ‌ణులంతా ఒక్కొక్క‌రుగా తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. కొంద‌రు పోలీస్ కేసులు పెడుతున్నారు.

ఇక రాజ్ కుంద్రాతో ఇలాంటి వ్య‌వ‌హారంలో తేడాలు రావ‌డంతో గ‌త ఏప్రిల్ లో షెర్లిన్ అత‌డిపై పోలీస్ కేసును పెట్టింది. ప్ర‌స్తుతం ఇంకా ఆ కేసు విచార‌ణ సాగుతోంది. ఓ బిజినెస్ డీల్ మాట్లాడే విష‌య‌మై త‌న ఇంటికే వ‌చ్చిన రాజ్ కుంద్రా త‌న‌పై బ‌లాత్కారానికి పాల్ప‌డ్డాడ‌ని బ‌ల‌వంతంగా ముద్దు పెట్టుకున్నాడ‌ని షెర్లిన్ ఆరోపించింది. శిల్పాశెట్టితో త‌న బంధం సంక్లిష్టంగా మారింద‌ని రాజ్ కుంద్రా త‌న‌తో అన్న‌ట్టు షెర్లిన్ ఈ సంద‌ర్భంగా వెల్ల‌డించింది. కానీ తాను పెళ్ల‌యిన‌వాడితో సంబంధం కొన‌సాగించే ఆలోచ‌న‌లో లేన‌ని అలాగే బిజినెస్ కోసం అలా చేయ‌కూడ‌ద‌నుకున్నాన‌ని తెలిపారు. త‌న‌ని బ‌ల‌వంతంగా ముద్దు పెట్టుకోబోతుంటే తాను భ‌య‌ప‌డి వాష్ రూమ్ కి పారిపోయాన‌ని కూడా షెర్లిన్ వ్యాఖ్యానించారు.

ఈ కేసులో షెర్లిన్‌ చోప్రాకు ముంబై క్రైం బ్రాంచ్‌ పోలీసులు సమన్లు జారీ చేశారు. అనంత‌రం రాజ్ కుంద్రాపై మ‌రోసారి షెర్లిన్‌ తీవ్ర ఆరోపణలు చేసింది. 2019లో రాజ్‌ కుంద్రా తన బిజినెస్‌ మెనేజర్ కు కాల్‌ చేసి ఒక డీల్ మాట్లాడారట‌. 2019 మార్చి 27న బిజినెస్‌ మీటింగ్‌ తరువాత రాజ్‌ కుంద్రా ఓ రోజు తనకు ఎలాంటి స‌మాచారం ఇవ్వ‌కుండానే ఇంటికి వ‌చ్చారు. ఓ సంక్షిప్త సందేశానికి సంబంధించిన‌ వాదనలో అత‌డు ఇంటికి వ‌చ్చి త‌ప్పుడుగా ప్ర‌వ‌ర్తించాడ‌ని తెలిపింది. శిల్పా శెల్లి వ‌ల్ల రాజ్ కుంద్రా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్న‌ట్టు త‌న‌తో అన్నాడ‌ని .. త‌మ బంధం స‌రిగా లేద‌ని చెప్పాడ‌ని షెర్లిన్ వ్యాఖ్యానించ‌డంతో ఇప్పుడు ఆ దిశ‌గానూ చ‌ర్చ మొద‌లైంది. ఈ కేసు ప‌ర్య‌వ‌సానాలు చాలా తీవ్రంగా ఉండ‌నున్నాయ‌ని కూడా అర్థ‌మ‌వుతోంది.