Begin typing your search above and press return to search.

నేను కొట్టింది నా భర్తనే: ప్రముఖ హీరోయిన్

By:  Tupaki Desk   |   14 May 2020 5:03 PM IST
నేను కొట్టింది నా భర్తనే: ప్రముఖ హీరోయిన్
X
దేశంలో కరోనా మహమ్మారి సాగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ పొడిగిస్తూ వస్తుంది కేంద్ర ప్రభుత్వం. సినీ సెలబ్రిటీలంతా ఎవరింటికి వారే ఇంట్లో కూర్చుని వంట వార్పు అంటూ కాలక్షేపం చేస్తున్నారు. ఇక బాలీవుడ్‌ సీనియర్ హీరోయిన్స్ అయితే టిక్‌టాక్‌ వీడియోలు చేస్తూ అభిమానులకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తున్నారు. స్టార్ బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి తన భర్త రాజకుంద్రా, కొడుకు వియాన్‌తో కలిసి టిక్‌టాక్‌ వీడియోలు చేస్తూ లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇటీవలే శిల్పాశెట్టి తన భర్తతో కలిసి చేసిన టిక్‌టాక్‌ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ వీడియోలో శిల్పాశెట్టి డ్యుయల్‌ రోల్‌ అంటే ఒక పాత్రలో రాజ్‌కుంద్రా భార్య లాగా, మరొక పాత్రలో ఇంటి పనిమనిషిగా కనిపించి తెగ ఆకట్టుకుంటున్నారు.

బ్యూటీ శిల్పాశెట్టి పార్టీకి సంబంధించిన డ్రెస్‌ను సెలెక్ట్‌ చేస్తున్నట్లుగా వీడియో సీన్ మొదలవుతుంది. ఇంతలో తన భర్త రాజ్‌ కుంద్రా శిల్పాను ముద్దు పెట్టడానికి ప్రయత్నించాడు. ఆమె వద్దని వారించడంతో కామ్ గా ఉండిపోతాడు. ఇంతలో సీన్‌లోకి పని మనిషి రూపంలో ఉన్న శిల్పాశెట్టి ప్రవేశిస్తుంది. పనిలో ఉన్నపు​డు ఎవరైనా ఇలాంటి పనులు చేస్తే చిరాకు కలుగుతుంది. అలా డిస్టర్బ్ చేసిన వారిని ఏదైనా చేయాలనీ అన్పిస్తుంది. వెంటనే ఇది తెలిసి శిల్పాశెట్టి తన భర్త రాజ్‌కుంద్రాను కొట్టడం ప్రారంభిస్తుంది. 'నేను సీరియస్‌గా ఒక పని చేస్తుంటే నా భర్త ముద్దు పెట్టడానికి ప్రయత్నించాడు. అందుకే అతని​ కొట్టాల్సి వచ్చింది. అయినా నేను కొట్టింది నా భర్తనే కదా' అంటూ సరదాగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియోకు నెటిజన్లు నెట్టింట్లో బ్రహ్మరధం పడుతున్నారు. కామ్ గా ఇంట్లో ఉండకుండా మమ్మల్ని టిక్ టాక్ ద్వారా అయినా అలరిస్తున్నందుకు థాంక్స్ మేడం అంటున్నారు శిల్పాశెట్టి ఫ్యాన్స్.
@theshilpashetty

Housewife aur Housemaid ki problems