Begin typing your search above and press return to search.
అప్పుడు ఒప్పుకుని - ఇప్పుడు లైంగిక ఆరోపణలా?
By: Tupaki Desk | 19 Oct 2018 9:48 AM GMTబాలీవుడ్ లో మీటూ ఉద్యమం ప్రారంభం అయ్యి - ఇప్పుడు దేశ వ్యాప్తంగా అన్ని సినిమా పరిశ్రమల్లో మరియు అన్ని రంగాల్లో కూడా మీటూ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. మీటూ అంటూ ఎంతో మంది ప్రముఖులపై లైంగిక ఆరోపణలు ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్నాయి. సమాజంలో గొప్ప పేరున్న ప్రముఖులు లైంగిక వేదింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ నటి శిల్పా షిండే ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
మీటూ ఉద్యమంపై శిల్పా షిండే మాట్లాడుతూ.. సినిమా పరిశ్రమలో లైంగిక వేదింపులు అనేవి ఉండవని - ఒకరిని ఇష్టపడితే ఆ విషయాన్ని బయట పెడతారని - ఒప్పుకోవడం - ఒప్పుకోక పోవడం అవతలి వారి ఇష్టమని - నిజంగా ఎవరికైనా అప్పటికప్పుడు లైంగిక వేదింపులుగా అనిపిస్తే ఎందుకు అప్పుడు మీడియా ముందుకు రాలేదు. అప్పుడు ఏదో విధంగా ఛాన్స్ రావాలనే ఉద్దేశ్యంతో అప్పటి వరకు సరే అనుకుని, ఆ తర్వాత లైంగిక ఆరోపణలు చేయడం జరుగుతుందని ఆమె ఆరోపిస్తుంది.
సినిమా పరిశ్రమ గొప్ప పరిశ్రమ అంటూ నేనేం చెప్పను - ఇక్కడ అంతా కూడా మంచి వారుంటారని కూడా నేను చెప్పను. కాని ఇక్కడ మన ప్రవర్తన మరియు మన ప్రతిభ ఆధారంగానే పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయని ఆమె పేర్కొంది. కొందరు చెడ్డవాళ్లు ఉన్న కారణంగా సినిమా పరిశ్రమ మొత్తాన్ని కూడా చెడ్డ పరిశ్రమ అంటూ పిలవడం ఏమాత్రం కరెక్ట్ కాదని శిల్పా షిండే చెప్పుకొచ్చింది. అవకాశాల కోసం కొన్ని సార్లు ఒప్పుకుని, ఆ తర్వాత లైంగిక ఆరోపణలు చేసే వారిని మొదట శిక్షించాలని కూడా శిల్పా షిండే సంచలన వ్యాఖ్యలు చేసింది.