Begin typing your search above and press return to search.
మహేష్ వదిన గాయపడింది
By: Tupaki Desk | 6 March 2016 9:29 AM GMTఅప్పుడెప్పుడో మోహన్ బాబుతో ‘బ్రహ్మ’ అనే సినిమా చేసిన శిల్పా శిరోద్కర్ గుర్తుంది కదా. సూపర్ స్టార్ మహేష్ బాబుకు వదిన అవుతుంది. ఎందుకంటే మహేష్ భార్య నమ్రతా శిరోద్కర్ కు ఈమె అక్కలెండి. ఇటీవల శిల్పా శిరోద్కర్ ఓ హిందీ సీరియల్ షూటింగ్ లో భాగంగా గాయపడింది. ఒకప్పుడు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన శిల్పా.. తర్వాత సీరియల్స్ లోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఆమె హిందీ సీరియల్ ‘సిల్ సిలా ప్యార్ కా'లో నటిస్తోంది. షూటింగులో భాగంగా డైలాగ్స్ చెబుతూ మొట్లు దిగుతుండగా ప్రమాదవశాత్తూ ఆమె కిందపడిపోయింది.
వెంటనే ఆమెను యూనిట్ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నట్లు చెబుతున్నారు. చాలా పై నుంచి కాలు జారిపడ్డ శిల్పా.. కింది వరకు దొర్లుకుంటూ వచ్చిందట. ఒంటి మీద బాగానే గాయాలైనప్పటికీ అదృష్టవశాత్తూ ఆమె వెన్నెముకకు ఫ్రాక్చర్ కాలేదు. ప్రస్తుతం ఆమె నడవలేని స్థితిలో బెడ్ రెస్ట్ తీసుకుంటోంది. విషయం తెలుసుకున్న మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ వెంటనే తన సోదరిని చూడ్డానికి ముంబయి వెళ్లింది. వీలు చూసుకుని మహేష్ బాబు.. పిల్లలు కూడా ముంబయి వెళ్లబోతున్నారు. మహేష్ కు నమ్రత ఫ్యామిలీతో చాలా మంచి సంబంధాలున్నాయి.