Begin typing your search above and press return to search.

నేనే బలిపశువు.. శిల్పాశెట్టి భర్త బోరుమన్నాడే?

By:  Tupaki Desk   |   26 Aug 2022 8:01 AM GMT
నేనే బలిపశువు.. శిల్పాశెట్టి భర్త బోరుమన్నాడే?
X
ముంబైలో వెలుగుచూసిన పోర్నోగ్రఫీ కేసులో ప్రముఖ వ్యాపారవేత్త.. బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా ఎన్ని కేసులు, ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నాడో అందరికీ తెలిసిందే. ఎంతో మంది హీరోయిన్లు సైతం ఆయనపై నోరుపారేసుకున్నారు. తమపై కూడా ఈ దందాలోకి లాగాలని చూశారని కామెంట్స్ చేశారు. ఈ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లి బెయిల్ పై కూడా వచ్చారు.

తాజాగా ఈ కేసుల్లో రాజ్ కుంద్రా అరెస్ట్ కాకుండా సుప్రీంకోర్టు నాలుగు వారాలా బెయిల్ ను మంజూరు చేస్తూ అతడికి ఊరటనిచ్చింది. అశ్లీల వీడియోలు తీసి అప్ లోడ్ చేశానన్న నేరారోపణలో తాను బలిపశువును అయ్యానని రాజ్ కుంద్రా వాపోయారు. ఈ కేసులో ఒక్క మహిళ కూడా తనకు వ్యతిరేకంగా చెప్పలేదని కోర్టుకు విన్నవించాడు. దర్యాప్తు సంస్థ కూడా ఏ ఒక్క ఆధారాన్ని కూడా సాక్ష్యాలతో నిరూపించలేకపోయిందని చెప్పాడు.

దీంతో తనపై మోపిన ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ కోర్టును ఆశ్రయించాడు రాజ్ కుంద్రా. తన న్యాయవాది ప్రశాంత్ పాటిల్ ద్వారా రాజ్ కుంద్రా కోర్టులో పిటీషన్ దాఖలు చేశాడు. చార్జీషీట్ లో ఏ ఒక్క మహిళ కూడా తాను బెదిరించినట్టు.. బలవంతం పెట్టినట్టు.. వీడియో తీసినట్టు చెప్పలేదని పిటీషన్ లో పేర్కొన్నాడు. తాను రహస్యంగా ఎలాంటి కంటెంట్ సృష్టించలేదని.. తాను అశ్లీల వీడియోలను ప్రసారం చేయడం.. అప్ లోడ్ చేయడం కానీ చేయలేదన్నారు.

జులై 19న రాజ్ కుంద్రాను అశ్లీల వీడియోల కేసులో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. గత వారం దిగువ కోర్టు అతడి ముందస్తు బెయిల్ పిటీషన్ ను తిరస్కరించింది. ఆ తర్వాత బాంబే హైకోర్టును అతడు ఆశ్రయించాడు. ఇది ఒక వారం పాటు అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాజ్ కుంద్రా అరెస్టు తర్వాత, ఇతని చీకటి వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. నగ్న వీడియోలు తయారు చేయడం, వాటిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడం వంటి అభియోగాలు రాజ్ కుంద్రాపై మోపబడ్డాయి.

కెన్నిన్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన ‘హాట్ షాట్స్ డిజిటల్ ఎంటర్ టైన్ మెంట్’ అనే మొబైల్ యాప్ ను రాజ్ కుంద్రాతో కలిసి బక్షి సంయుక్తంగా నిర్వహిస్తున్నారని ముంబై జాయింట్ పోలీస్ కమిషనర్ (క్రైమ్) మిలింద్ భరంబే అప్పట్లో తెలిపారు.హాట్ షాట్ ల యాప్ ను ప్రపంచంలోని 18 సంవత్సరాలు నిండిన ఎవరైనా డౌన్ లోడ్ చేసుకొని వాడేలా రూపొందించారు. ఇందులో ప్రపంచంలోనే ప్రత్యేకమైన హాటెస్ట్ మోడల్స్, షార్ట్ ఫిల్మ్ లు, హాట్ వీడియోలను ప్రదర్శిస్తారు. ఇది ఒక సాఫ్ట్ అశ్లీల యాప్ గా రూపొందించినట్టు తెలుస్తోంది. ఇక ఈ యాప్ నుంచి ఉచితంగా అశ్లీల కంటెంట్ ను డౌన్ లో చేసుకునేలా రూపొందించారు.

గత ఏడాది ఇది ఫిబ్రవరి 4వ తేదీన మహిళలను బలవంతంగా శృంగార సినిమాల్లోకి నెట్టిన ఆరోపణలపై ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ కేసులో విచారణ ప్రారంభించిన మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులకు పోర్న్ చిత్రాల వ్యాపార రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. బ్రిటన్ వేదికగా నడుస్తున్న యుకె ప్రొడక్షన్ అధిపతి ఉమేష్ కామత్ తో రాజ్ కుంద్రా కు సంబంధాలున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. సినిమాల్లో, టెలివిజన్లలో నటించేందుకు ఉత్సాహం చూపించే మోడల్స్, అమ్మాయిలను వీరు టార్గెట్ చేస్తారు. వెబ్ సిరీస్, ఇతర షూటింగులు జరుపుతున్నట్లు నమ్మించి చివరి క్షణంలో స్క్రిప్ట్ మార్చేస్తారని పోలీసులు చెబుతున్నారు. ముంబై శివార్లలో షూటింగ్ చేసిన అనంతరం శృంగార వీడియోలను సోషల్ మీడియాలో ఉంచుతారు. సదరు వీడియోలను మన దేశం లో ప్రసారం చేయడం నేరం కాబట్టి బయట దేశాల్లోని సర్వర్ల ద్వారా హాట్ షాట్ అనే యాప్ లోకి అప్లోడ్ చేస్తున్నారు. లాక్ డౌన్లో పుణ్యమా అని సదరు యాప్ లోకి వివరాలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి చేరారు. వీరు నుంచి చి డబ్బులు వసూలు చేసి వాటి ప్రసారాలను అందజేస్తారు.

అయితే రాజ్ కుంద్రాకు వ్యతిరేకంగా ఒక్క ఆధారాన్ని కూడా దర్యాప్తుసంస్థలు సమర్పించకపోవడంతో ఆయనకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.