Begin typing your search above and press return to search.
తమిళ ఎంపీకి శింబు సవాల్...వైరల్!
By: Tupaki Desk | 11 July 2018 2:09 PM GMTతమిళ స్టార్ హీరో - ఇళయ దళపతి విజయ్ నటిస్తోన్న `సర్కార్` చిత్రం ఫస్ట్ లుక్ పై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. సిగరెట్ తాగకుండా ఉంటే విజయ్ ఇంకా స్టైలిష్ గా కనిపించేవారంటూ ఎంపీ అంబుమణి రామదాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దాంతోపాటు, ధూమపానాన్ని ప్రోత్సహించేలా ఈ పోస్టర్ ఉందంటూ సామాజిక కార్యకర్త ఒకరు కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాలతో ఆ పోస్టర్ ను తొలగించారు. అయితే, అటువంటి పోస్టర్ విడుదల చేసినందుకు రూ.10 కోట్లు ఫైన్ కట్టాలంటూ మరో పిటిషన్ కూడా దాఖలైంది. ఈ నేపథ్యంలో విజయ్ కు పలువురు కోలీవుడ్ దర్శకనిర్మాతలు బాసటగా నిలిచారు. ఆ పోస్టర్ పై అభ్యంతరం వ్యక్తం చేయడం....సినిమాలపై.. తమిళులపై చేసే దాడి అని ప్రముఖ దర్శకనిర్మాత టి.రాజేందర్ మండిపడ్డారు. విజయ్ పై రాజకీయ కుట్ర జరుగుతోందని - ధూమపానం హానికరమైతే సిగరెట్లనే ప్రభుత్వం బ్యాన్ చేయొచ్చు కదా అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ వివాదంపై హీరో శింబు ఘాటుగా స్పందించారు.
విజయ్ కు మద్దతుగా సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ధూమపానంపై రాందాస్ బహిరంగ చర్చకు రావాలని శింబు సవాల్ విసిరారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. స్వప్రయోజనాల కోసం రాందాస్ ....చిన్న పోస్టర్ పై వివాదం చేశారంటూ మండిపడ్డారు. ఇటువంటి చర్యలు ....సినిమా వాళ్ల క్రియేటివిటీని హరిస్తాయన్నాడు. గతంలో రజనీకి కూడా ఈ తరహా ఇబ్బందులు వచ్చాయని, విజయ్ ను ఇబ్బందులకు గురిచేసేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారని ఆరోపించాడు. ధూమపానంపై బహిరంగ వేదికలపై చర్చించడానికి తాను రెడీ అని - దానికి రాందాస్ అంకుల్ ను ఆహ్వానిస్తానని శింబు సవాల్ విసిరారు. రాజకీయాలకు సినిమాను దూరం చేసేందుకు కుట్ర జరుగుతోందని అన్నారు. ఈ తరహా వివాదాలకు చర్చల ద్వారానే చెక్ పెట్టవచ్చని అన్నారు. మరి, శింబు సవాల్ కు రాందాస్ ఏ విధంగా స్పందిస్తారో వేచిచూడాలి.