Begin typing your search above and press return to search.
రెండు రోజుల ఆలస్యంగా మనముందుకు ముత్తు
By: Tupaki Desk | 14 Sep 2022 6:42 AM GMTశింబు హీరోగా రూపొందిన తమిళ్ మూవీ 'వెందు తనిన్దాతు కాడు' రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు స్రవంతి మూవీస్ వారు తీసుకు వచ్చేందుకు గాను హక్కులు తీసుకోవడం జరిగింది. చివరి నిమిషంలో తెలుగు రైట్స్ ను కొనుగోలు చేసినా కూడా తమిళ వర్షన్ విడుదల సమయం లోనే తెలుగు లో కూడా విడుదల చేస్తామని అన్నారు.
డబ్బింగ్ కార్యక్రమాలతో పాటు తెలుగు లో విడుదల కోసం ఇతర కార్యక్రమాలు పూర్తి అవ్వలేదు. దాంతో సినిమా ను తమిళ వర్షన్ తో పాటు విడుదల చేయడం సాధ్యం కాదని స్రవంతి మూవీస్ వారు స్వయంగా ప్రకటించారు. ఈ సినిమాను తెలుగు లో లైఫ్ ఆఫ్ 'ముత్తు' అనే టైటిల్ తో విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ఇక్కడ మొదలు పెట్టారు.
తీరా సినిమా హడావుడిగా విడుదల చేస్తే డబ్బింగ్ క్వాలిటీ ఉండదని.. అలాగే కొన్ని ప్రధానంగా కనిపించే తమిళ అక్షరాలను మార్చాల్సిన అవసరం ఉంది కనుక రెండు రోజుల ఆలస్యంగా ముత్తు సినిమాను విడుదల చేయాలని స్రవంతి మూవీస్ వారు నిర్ణయించుకున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
శింబు హీరోగా రూపొందిన ఈ సినిమా కు ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించాడు. గతంలో గౌతమ్ మీనన్ మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించాడు. కనుక ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఉండే అవకాశం ఉందని మీడియా వారు కూడా నమ్మకంగా ఉన్న సమయంలో వాయిదా వేశారు.
రేపు ముందుగా అనుకున్న ప్రకారం తమిళ వర్షన్ విడుదల కాబోతుంది. కానీ తెలుగు లో మాత్రం రెండు రోజుల ఆలస్యంగా అంటే శనివారం సినిమా విడుదల కాబోతుంది. ఇప్పటికే సినిమా యొక్క అడ్వాన్స్ బుకింగ్ మొదలు పెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద మొత్తంలోనే అడ్వాన్స్ బుకింగ్ అయ్యాయి. దాంతో ఇప్పుడు కాస్త గందరగోళం ఏర్పడింది. శనివారం అయినా విడుదల కన్ఫర్మ్ గా ఉంటుందా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.