Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ : సింగర్ కమ్ యాక్ట్రెస్ గ్లామర్ షో అదుర్స్..!

By:  Tupaki Desk   |   4 Nov 2022 5:31 AM GMT
ఫోటో స్టోరీ : సింగర్ కమ్ యాక్ట్రెస్ గ్లామర్ షో అదుర్స్..!
X
టీ సీరీస్ యూట్యూబ్ కాంటెస్ట్ లో బెడ్ రూమ్ లో పైజామా వేసుకుంటూ ఉన్న వీడియోతో పాపులర్ అయిన న్యూజిలాండ్ బ్యూటీ షిర్లే సెతియా. అక్కడ సింగర్ గా తన కెరియర్ సాగిస్తున్న అమ్మడు మన దగ్గర హీరోయిన్ గా టర్న్ అయ్యింది. మస్కా మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ష్రిలే సెతియా లెటెస్ట్ గా నిక్కమ్మ సినిమాలో కూడా నటించింది.

ఆ సినిమా చూసే తెలుగులో నాగ శౌర్య తో ఛాన్స్ అందుకుంది. అనీష్ కృష్ణ డైరక్షన్ లో నాగ శౌర్య హీరోగా నటించిన కృష్ణా వ్రిందా విహారి సినిమాలో షిర్లే సెతియా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో అమ్మడి నటనకు మంచి మార్కులే పడ్డాయి.

సినిమా థియేట్రికల్ రిలీజ్ పెద్దగా ఆడకపోయినా ఓటీటీలో మాత్రం ప్రేక్షకులను అలరిస్తుంది. బాలీవుడ్ లో రెండు సినిమాలు తెలుగులో ఒక సినిమా చేసిన అమ్మడు తనకు వచ్చిన ఈ ఐడెంటిటీ మరింత పెంచుకునేలా ఫోటో షూట్స్ తో రెచ్చిపోతుంది.

లేటెస్ట్ గా షిర్లే సెతియా బ్లాక్ టాప్.. లైట్ బ్లూ టాన్ జీన్స్ తో హాట్ ఫోజులిచ్చింది. అమ్మడిని చూస్తుంటే ఎంతటి మగవాడైనా సరే ఆమె మాయలో పడిపోవాల్సిందే. కేవలం సినిమాల్లోనే కాదు ఇప్పటి హీరోయిన్స్ సినిమాలో స్కోప్ లేకపోయినా తమ సోషల్ మీడియాలో సూపర్ కంటెంట్ తో వస్తున్నారు. తమ ఫోటో షూట్ తో ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తున్నారు.

అదే వారికి సూపర్ క్రేజ్ తీసుకొస్తుంది. షిర్లే సెతియా నటించిన మూడు నాలుగు సినిమాల కన్నా అమ్మడి ఫోటో షూట్స్ మాత్రమే వైరల్ గా మారుతున్నాయి. ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ తమని తాము ప్రమోట్ చేసుకుంటున్నారు బాలీవుడ్ హీరోయిన్స్. అందుకే షిర్లే సెతియా కూడా తన గ్లామర్ ట్రీట్ తో సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ ని అలరిస్తుంది. కృష్ణా వ్రిందా విహారి తర్వాత ఆమెకు తెలుగులో మరో లక్కీ ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తుంది.

సింగర్స్ అందంగా ఉంటే అదో రేంజ్.. అందులో షిర్లే సెతియా లాంటి బ్యూటీలకు సూపర్ డిమాండ్ ఉంటుంది. న్యూజిలాండ్ లో సింగర్ గా చేస్తూ ఇండియాలో మాత్రం హీరోయిన్ గా చేస్తున్న షిర్లే సెతియా ఛాన్స్ ఇస్తే ఇక్కడ కూడా తన సాంగ్స్ తో మెప్పించేలా ఉంది. తప్పకుండా ఏది కుదిరితే అది చేస్తూ ఇండియన్ సినిమాల్లో సెటిల్ అవ్వాలని చూస్తుంది అమ్మడు. సినిమాలే కాదు అమ్మడు చేస్తున్న ఈ ఫోటో షూట్స్ ఆమెకి మరింత మైలేజ్ వచ్చేలా చేస్తున్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.