Begin typing your search above and press return to search.

56 వ‌య‌సులో చొక్కా చించిన కింగ్ ఖాన్

By:  Tupaki Desk   |   11 July 2022 4:33 AM GMT
56 వ‌య‌సులో చొక్కా చించిన కింగ్ ఖాన్
X
బాలీవుడ్ కింగ్ షారూఖ్ ఖాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. కేవ‌లం భార‌త‌దేశంలోనే కాకుండా ప్ర‌పంచ దేశాల్లో అత‌డికి వీరాభిమానులున్నారు. ఖాన్ సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌నాలు సృష్టించ‌డానికి ఈ ఫాలోయింగ్ ప్ర‌ధాన కార‌ణం. ద‌శాబ్ధాల కెరీర్ లో న‌టుడిగా అత‌డు శిఖ‌రాన్ని చేరుకున్నాడు. హీరోయిజాన్ని మ‌రో లెవ‌ల్ కి తీసుకెళ్లిన ఘ‌నుడు అత‌డు. రెడ్ చిల్లీస్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ పేరుతో ఖాన్ వేల కోట్ల సామ్రాజ్యాన్ని విస్త‌రించాడు.

షారూక్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో న‌టిస్తున్నాడు. అత‌డు ప‌ఠాన్ తో పాటు అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో భారీ పాన్ ఇండియా చిత్రంలో న‌టిస్తున్నాడు. రాజ్ కుమార్ హిరాణీతోనూ భారీ చిత్రానికి స‌న్నాహ‌కాల్లో ఉన్నాడు.

తాజాగా ఖాన్ `షర్ట్ లెస్` లుక్ సోష‌ల్ మీడియాల్లోకి విడుద‌లైంది. ఈ లుక్ చూడ‌గానే అభిమానులు ఒక్క‌సారిగా ఉలిక్కిపాటుకు గుర‌య్యారు. 56 వ‌య‌సులో ఖాన్ ఇంత ప‌ర్ఫెక్ట్ టోన్డ్ బాడీతో 6 ప్యాక్ అవ‌తార్ తో షాక్ లిస్తున్నాడంటూ వ్యాఖ్యానిస్తున్నారు. SRK మ్యాజిక్ ను అన్ని వేళ‌లా ప్రేమిస్తున్నాము అంటూ అభిమానులు అంటున్నారు. ఓ పాపుల‌ర్ బ్రాండ్ కోసం కొత్త ప్రకటనలో షారుఖ్ ఖాన్ షర్ట్ లేకుండా కనిపించ‌నున్నారు.

ద‌శాబ్ధాల పాటు కింగ్ ఖాన్ ఆన్ స్క్రీన్ ప్రదర్శనలతో పాటు.. వాణిజ్య ప్రకటనలలో కూడా తన మాయాజాలాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నాడు. ఇటీవల అతను ఒక లగ్జరీ బ్రాండ్ కోసం ప్రకటనలో తన కొత్త చొక్కా లేని అవతార్ ను చూపించాడు. ఈ వాణిజ్య ప్రకటన నుండి ఒక వీడియో ఇంటర్నెట్ లో తుఫాన్ గా మారింది.

కొత్త TVCలో బాడీ వాష్ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తున్నప్పుడు చొక్కా లేని అవతార్ లో కనిపించాడు. ఖాన్ ప‌ర్ఫెక్ట్ టోన్డ్ బాడీతో కనిపించాడు... అత‌డి అంద‌మైన‌ చిరునవ్వు అభిమానుల హృద‌యాల‌ను తాకింది.

కభీ ఖుషీ కభీ ఘుమ్- కుచ్ కుచ్ హోతా హై- దిల్ తో పాగల్ హై- యెస్ బాస్ - డర్ వంటి ఐకానిక్ సినిమాల నుండి త‌న పాత్ర‌ల‌ను అభిమానులకు గుర్తు చేస్తూ షారూఖ్ తన టోన్డ్ ఫిజిక్ ని ప్ర‌ద‌ర్శించాడు. బ్రాండ్ వీడియోని షేర్ చేసిన వెంటనే అభిమానులు త‌మ‌ సందేశాలతో వ్యాఖ్యల విభాగాన్ని నింపారు. ది SRK మ్యాజిక్!! అని ఒక‌రు.. ``షార్క్ చాలా హాట్ గా కనిపిస్తున్నారు`` అని ఫ‌న్ తో కూడుకున్న వ్యాఖ్య‌ను జోడించారు ఒక అభిమాని

56 ఏళ్ల ఖాన్.. సిద్ధార్థ్ ఆనంద్ `పఠాన్‌`తో సంచ‌ల‌నాలు సృష్టించాల‌ని పట్టుద‌ల‌తో ఉన్నారు. అట్లీతో జవాన్ అలాగే డుంకీ చిత్రంలోనూ న‌టిస్తున్నారు. షారూక్ చివరిగా 2018లో విడుదలైన ఆనంద్ ఎల్. రాయ్ `జీరో`లో కనిపించాడు. నిర్మాత‌గానూ ఖాన్ డార్లింగ్స్ మూవీని తెర‌కెక్కిస్తున్నారు. ఇటీవల డార్లింగ్స్ టీజర్ ని విడుద‌ల చేసారు. ఇందులో అలియా భట్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోంది. నెట్ ఫ్లిక్స్ మూవీని తన బ్యానర్ ఎటర్నల్ సన్ షైన్ ప్రొడక్షన్స్ పై SRK రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ సహకారంతో నిర్మించింది.