Begin typing your search above and press return to search.
త్రీసమ్ ప్రేమను తగలబెట్టేశారు!!
By: Tupaki Desk | 8 Nov 2016 3:33 PM GMTఇండియన్ ఫిలిం హిస్టరీలో తొలిసారిగా 'త్రీసమ్ లవ్' కాన్సెప్ట్ తో తెరకెక్కిన మూవీ ఇష్క్ జునూన్. ఈ నెల 11న విడుదల కాబోతోన్న ఈ చిత్రంపై ముందు నుంచే వివాదాలు ఉండగా.. ఇప్పుడా కాంట్రవర్సీలు రోడ్డెక్కాశాయి కూడా.
ఇష్క్ జునూన్ మూవీ మేకర్స్ పై.. పోస్టర్ డిజైనర్స్ పై ముంబైలో పోలీసు కేసు నమోదైంది. బూతు కంటెంట్ మరీ శృతి మించిందని.. చూసేందుకు అసహ్యంగా ఉండే పోస్టర్లను ఉపయోగించి పబ్లిసిటీ చేస్తున్నారని అంటోంది శివసేన. అందుకే జుహు పోలీస్ స్టేషన్ లో ఈ మేరకు ఫిర్యాదు చేసింది శివసేన పార్టీ. అక్కడితే ఆగిపోతే అది శివసేన తీసుకున్న స్టెప్ ఎందుకవుతుంది? శివసేన కార్యకర్తలు రోడ్డెక్కి మరీ ఈ మూవీ పోస్టర్లను చించిపారేశారు. పబ్లిసిటీ కోసం ఉపయోగించిన ఫ్లెక్సీలను మంటల్లో వేల్చి కాల్చేసి మరీ నిరసన తెలియచేశారు.
రాజ్ బీర్ సింగ్.. దివ్యా సింగ్. అక్షయ్ రంగ్ సాహీలు నటిస్తున్న ఈ చిత్రంలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ టైపులో.. ముగ్గురు కలిసి ఎంజాయ్ చేసే సీన్స్ ను చూపించబోతున్నారట. అది కూడా భారతీయుల మనోభావాలు దెబ్బతినకుండా అని చెబుతున్నారు మేకర్స్. మరిప్పుడు శివసేన రంగంలోకి దిగడంతో.. సీన్ మారిపోయింది. ఈ గొడవను అయినా కంటిన్యూ చేస్తారో.. లేక యే దిల్ హై ముష్కిల్ వివాదాన్ని 5 కోట్ల విరాళంతో సరిపెట్టినట్లు.. దీనికి కూడా రేటు కట్టేస్తారో? అనే టాక్ వినిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/