Begin typing your search above and press return to search.
గతి లేక బిగ్ బాస్ కి వచ్చామా?
By: Tupaki Desk | 22 July 2017 9:05 AM GMTతెలుగు టివి షో లో ఇప్పుడు అందరూ ఆసక్తిగా చూసే షోలలో బిగ్ బాస్ కూడా ఉంది. ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ మొదలు పెట్టి వారం కావస్తుంది. షో ఏమి అంతా కిక్ ఇవ్వటం లేదు అని అనిపిస్తున్న టైమ్ లో ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా వివాదాలతో కొత్త మలుపులు తిరగబోతుంది. ఈ షో లో పాల్గొనే వారు అంతా ఒకే దగ్గర ఉండాలి కొన్ని రోజులు బయట ప్రపంచానికి సంబంధం లేకుండా మిగతా వారితో కలిసి అక్కడ బిగ్ బాస్ రూల్స్ ప్రకారం నడుచుకోవాలి. ఇక్కడే ఒక తెలుగు నటుడు హర్ట్ అయ్యాడు. నేనే ఏమి గతి లేక ఇక్కడకు వచ్చిన వాడిలా కనిపిస్తున్ననా మీకు అని బిగ్ బాస్ యాజమాన్యం పై కోపం తెచ్చుకున్నాడు. అసలు ఏమైంది అంటే..
నటుడు శివబాలాజీకి సిగరేట్ తాగే అలవాటు ఉంది. అయితే బిగ్ బాస్ రూల్స్ ప్రకారం స్మోక్ రూమ్ లోకి ఒక్కసారి ఒక్కరు మాత్రమే వెళ్ళాలి. కానీ తొలి రోజే స్మోక్ రూమ్ లోకి ఐదుగురు వెళ్ళారు. రూల్స్ ని పాటించనందుకు వాళ్ళకి శిక్ష కూడ పడింది. అది ఏంటంటే రోజు ఇచ్చే సిగరెట్లను ఇవ్వడం ఆపేశారట. తదుపరి నిర్ణయం వచ్చేంత వరకు ఈ శిక్షను అనుభవించాలి అని కచ్చితంగా చెప్పేశారు బిగ్ బాస్ టీమ్ వాళ్ళు. దానితో శివ బాలాజీకి కోపం వచ్చి బిగ్ బాస్ షోలో ఉండే అన్నీ టాస్క్ లు వంద శాతం మనసు పెట్టె చేస్తున్నామని.. అలాంటప్పుడు మా పై ఇంత కఠినంగా వ్యవహరించడం సరికాదు అని చెబుతూ, అయన మేము గతి లేక బిగ్ బాస్ షో కి వచ్చామా? ఏంటి అని అరిచాడు. అక్కడే ఉన్న మరి కొంతమంది స్మోకర్స్ ధన్‌రాజ్, సమీర్, ముమైత్ ఖాన్ లు శివబాలాజీకి మద్దతు తెలిపారు. ఇదంతా విన్న బిగ్ బాస్ నిర్ణయం వెనక్కి తీసుకుంది.
కాకపోతే ఒకరు స్మోక్ చేసినప్పుడు మిగతా 13 మంది సభ్యులు బాత్రూమ్‌లో ఉండాలని కండీషన్ పెట్టారు. అయితే కొంతమంది స్మోక్ చేసి వచ్చిన తరువాత బిగ్ బాస్ కు వాళ్ళు క్షమాపణ చెప్పారు. కాకపోతే ఒకరు స్మోక్ చేస్తుంటే మిగిలిన 13 మంది బాత్రూమ్‌లో ఉండాలన్న కండీషన్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి తెలుగు బిగ్ బాస్ కూడ మరీ అంతా గొప్పగా అలరించకపోయాన ఇలా టీ కప్పులోని తుఫాను లా మారుతోంది అనమాట.