Begin typing your search above and press return to search.
పవర్ స్టార్ చేసిన జన్మదిన వేడుక ఇది!
By: Tupaki Desk | 15 Oct 2016 2:03 PM GMTపుట్టిన రోజు పండుగే అందరికీ అంటారు. కానీ, ఒక వయసు దాటిన తరువాత బర్త్ డే సెలబ్రేషన్ల మీద పెద్దగా మోజు ఉండదు. అయితే, కొన్ని పుట్టినరోజులు ఎప్పటికీ మరచిపోలేని మధురానుభూతులగా మిలిగిపోతాయి. అలాంటి ఓ అరుదైన అనుభవాన్ని రుచి చూశాడు నటుడు శివ బాలాజీ. కాటమరాయుడు సెట్స్ లో అతడి జన్మదిన వేడుకలను పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దగ్గరుండి చేశారు. తన బర్త్ డే ఇంత ఘనంగా జరుగుతుందని ఊహించలేదనీ, పవన్ కల్యాణ్ కు ఎంతో రుణపడి ఉంటానని శివ బాలాజీ అంటున్నాడు. సెట్స్ లో జరిగిన జన్మదిన వేడుక గురించి ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టాడు.
పవన్ కల్యాణ్ సెట్ లోకి రాగానే తాను గుడ్ మార్నింగ్ చెప్పాననీ, ఆయన కూడా నవ్వుతూ పలకరించి "శివా.. బాగున్నావా" అనేంతలోనే దర్శకుడు డాలీ అక్కడికి వచ్చారట. "ఇవాళ్ల శివ బర్త్ డే సార్" అని పవన్ కు చెప్పడంతో... "అవునా.. ఇవాళ్ల నీకు ఏదో ఒకటి చెయ్యాలోయ్" అంటూ భుజం మీద చేయి వేసి మాట్లాడారు అని శివ బాలాజీ అన్నాడు. వెంటనే ప్రొడెక్షన్ వాళ్లను పిలిపించి తనకు ఇష్టమైన పేద్ద కేక్ ఆర్డరు ఇవ్వమని చెప్పారు. ఆ తరువాత, క్షణాల్లో అక్కడి పరిస్థితులు మారిపోయాయనీ, ఈలోగా తన భార్య పిల్లల్ని కూడా పిలవొచ్చా అని పవన్ ను అడిగితే.. "మొత్తం ఫ్యామిలీని రమ్మని చెప్పు" అని పవన్ అనుమతిచ్చారని శివ బాలాజీ అన్నాడు.
నా పుట్టిన రోజుకు ఇంత విలువ ఇచ్చిన పవన్ కల్యాణ్ ను ఎప్పటికీ మరచిపోలేనని అంటున్నాడు. ఈరోజు నాకు చాలా ప్రత్యేకమైంది, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న పవన్ కల్యాణ్ చేతులు మీదుగా బర్త్ డే జరగడం.. కలో నిజమో అర్థం కావడం లేదని పొంగిపోతున్నాడు. ఇది మాటల్లో చెప్పలేని అనుభూతి అని, ఈ పుట్టిన రోజును నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని మధురానుభూతిని నింపిన దర్శకుడు డాలీకి టన్నుల కొద్దీ థ్యాంక్స్ అని ఫేస్ బుక్ లో ఈ అనుభవాన్ని శివబాలాజీ పంచుకున్నాడు. పవర్ స్టార్ చేతులు మీదుగా బర్త్ డే... ఇంతకంటే మధురానుభూతి ఇంకేం ఉంటుంది చెప్పండీ!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/