Begin typing your search above and press return to search.

శివ కార్తికేయన్.. అందుకే ఈ స్థాయికి వచ్చాడు..!

By:  Tupaki Desk   |   24 Nov 2022 8:30 AM GMT
శివ కార్తికేయన్.. అందుకే ఈ స్థాయికి వచ్చాడు..!
X
కోలీవుడ్ వర్సటైల్ హీరో శివ కార్తికేయన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. టీవీ రంగం నుంచి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శివ.. కెరీర్ ప్రారంభంలో క్యారక్టర్ ఆర్టిస్టుగా నటించాడు. ఆ తర్వాత హీరోగా మారి వరుస విజయాలతో దూసుకుపోతున్నారు.

వైవిధ్యమైన చిత్రాలు విలక్షణమైన పాత్రలతో శివ కార్తికేయన్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. సింగర్ గా పాటలు పాడటమే కాదు.. లిరిసిస్ట్ గా పాటలు రాసి మల్టీ టాలెంటెడ్ అనిపించుకున్నారు. అంతేకాదు శివ కార్తికేయన్ ప్రొడక్షన్స్ బ్యానర్ ను స్థాపించి నిర్మాతగానూ సత్తా చాటుతున్నాడు.

ఎలాంటి బ్యాగ్రౌండ్ సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన శివ కార్తికేయన్.. తన స్వయం కృషితో ఈ స్థాయికి ఎదిగాడు. సినిమాల్లోకి రావాలని ఆశపడే ఎందరికో ఆదర్శంగా నిలిచాడు. ఎలాంటి పొజిషన్ లో వున్నా.. తమ మూలాలను మర్చిపోకూడదని భావించే వ్యక్తి అతను.

ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే సిద్దాంతాన్ని పాటిస్తుంటాడు శివ కార్తికేయన్. సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నప్పుడు అందరితో ఎలా ఉండేవాడో.. ఇప్పుడు హీరోగా రాణిస్తున్నప్పుడు కూడా అలానే ఉండటం ఆయనకే చెల్లింది.

ఇండస్ట్రీలో పెద్దల పట్ల గౌరవం.. తన తోటి నటీనటులతో స్నేహ భావంతో మెలిగే విధానం శివ కార్తికేయన్ ను అందరిలో ప్రత్యేకంగా నిలిపాయి. తానొక స్టార్ అనే భావన ఏమాత్రం లేకుండా అందరితో కలిసి పోతుంటాడు. అందుకే చిత్ర పరిశ్రమలో శివ ని ఇష్టపడేవారే తప్ప, ద్వేషించేవారు ఉండరు.

ఇలాంటి మంచి లక్షణాలే భాషతో సంబంధం లేకుండా అందరూ శివ కార్తికేయన్ ను అభిమానించాలే చేశాయి. తమిళ నటీనటులతో కాదు.. తెలుగు కన్నడ మలయాళ హిందీ ప్రముఖులతోనూ అతనికి మంచి సాన్నిహిత్యం ఉంది. కుదిరినప్పుడల్లా వారిని కలుస్తూ ఏదొక మంచి విషయాలని నేర్చుకుంటూ ఉంటాడు.

2022 ఏడాడిలో శివ కార్తికేయన్ అనేకమంది స్టార్ యాక్టర్స్ మరియు ఫిలిం మేకర్స్ ని మీట్ అయి ముచ్చటించారు. లేటెస్టుగా కోలీవుడ్ హీరో అజిత్ కుమార్ ను కలిసిన శివ.. ఆయనతో దిగిన ఓ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. AK తో SK అంటూ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు.

ఈ ఏడాదిలో అంతకముందు రజినీ కాంత్ - కమల్ హసన్ - అమీర్ ఖాన్ - శివ రాజ్ కుమార్ - పవన్ కళ్యాణ్ - రాజమౌళి - విజయ్ - ఎన్టీఆర్ - రామ్ చరణ్.. ఇలా ప్రతీ ఇండస్ట్రీలోని ప్రముఖులతో ఏదొక సందర్భంలో శివ కార్తికేయన్ వారితో కలిసి మాట్లాడారు. ఇది నిజంగా ప్రత్యేకమని చెప్పాలి. ఎలాంటి ఈగోలు లేకుండా అందరితో మంచి సంబంధాలు కొనసాగిస్తారు కాబట్టే ఇలాంటివి సాధ్యం అవుతాయి.

ఇక డబ్బింగ్ సినిమాలతో శివ కార్తికేయన్ తెలుగులోనూ క్రేజ్ ఏర్పరచుకున్నాడు. 'రెమో' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో.. 'వరుణ్ డాక్టర్' 'కాలేజ్ డాన్' వంటి చిత్రాలతో మంచి విజయాలు అందుకున్నారు. ఇటీవల "ప్రిన్స్" అనే స్ట్రెయిట్ తెలుగు సినిమా కూడా చేశారు. త్వరలో 'మహావీరుడు' అనే చిత్రంతో పలకరించడానికి శివ రెడీ అవుతున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.