Begin typing your search above and press return to search.

అనసూయ రాగానే అలా పక్కకు వెళ్లి కూర్చున్నా..!

By:  Tupaki Desk   |   10 March 2021 6:00 PM IST
అనసూయ రాగానే అలా పక్కకు వెళ్లి కూర్చున్నా..!
X
జబర్దస్త్‌ యాంకర్‌ అనసూయకు ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇద్దరు పిల్లలకు తల్లి అయినా కూడా అనసూయ అందంను ఆరాధించే వారు ఎంతో మంది ఉంటారు. హీరోయిన్‌ రేంజ్ లో స్టార్‌ డంను దక్కించుకున్న అనసూయ అంటే యంగ్‌ హీరో కార్తికేయకు కూడా విపరీతమైన అభిమానమట. ఆ విషయాన్ని స్వయంగా చావు కబురు చల్లగా ప్రీ రిలీజ్ వేడుక సందర్బంగా పెద్ద ఎత్తున ఉన్న జనాల ముందు చెప్పుకొచ్చాడు. అనసూయ చావు కబురు చల్లగా సినిమాలో ఒక ప్రత్యేక పాటను చేసిన విషయం తెల్సిందే. ఆ విషయమై హీరో కార్తికేయ ప్రత్యేంగా ఆమెకు కృతజ్ఞతలు తెలియజేశాడు.

చావు కబురు చల్లగా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్బంగా కార్తికేయ మాట్లాడుతూ.. అనసూయ గారు సెట్ కు మొదటి సారి వచ్చిన సమయంలో నేను ఆమెకు కనిపించకుండా కాస్త దూరంగా వెళ్లి కూర్చుని ఆమెను అలాగే చూస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆమె ముందే నెలబడి మిడిగుడ్లు వేసుకుని అలాగే చూస్తూ ఉంటే బాగోదు కాబట్టి పక్కకు వెళ్లి కూర్చుని చూస్తూ ఉండి పోయాను. నేను నిజంగా మీ అభిమానిని.. నాతో నా సినిమాలో సాంగ్‌ చేసినందుకు థ్యాంక్యూ అంటూ అనసూయను ఉద్దేశించి అన్నాడు. అనసూయ మరియు కార్తికేయ కాంబోలో పైన పటారం లోన లొటారం పాటను విడుదల చేశారు. పాటకు మంచి స్పందన వచ్చింది. అనసూయ లుక్ పై కూడా అభిమానులు పాజిటివ్ గా స్పందించారు.