Begin typing your search above and press return to search.
మందు సిగరెట్ మానాలని రజనీని హెచ్చరించిన నటుడు!
By: Tupaki Desk | 12 Dec 2020 8:33 AM GMTనిజాయితీ విషయానికి వస్తే సూపర్ స్టార్ రజనీకాంత్‌తో ఎవరూ పోటీపడలేరు. తన స్నేహితుడైన బహుముఖ నటుడు శివకుమార్ తనను దురలవాట్ల నుంచి బయటపడమని కోరిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ తాను రాసిన హృదయపూర్వక లేఖలో తన దురలవాట్ల గురించి ఓపెనయ్యారు.
రజనీకాంత్ మద్యపానం ధూమపాన అలవాట్ల గురించి అతను ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యల గురించి ఎక్కడా ఏనాడూ రహస్యంగా దాచుకోలేదు. తనకు చెడు అలవాట్లు ఉన్నప్పటికీ శివకుమార్ ఏనాడూ తన స్నేహితుడు రజనీకాంత్ ను వదులుకోలేదు. ఎందుకంటే తలైవర్ ను తన వ్యసనాన్ని వదులుకోవాలని నిరంతరం ఒప్పించాడు.
``నేను గతంలో అతనితో సినిమాల్లో పనిచేయడం వల్ల కొన్ని అమూల్యమైన జీవిత పాఠాలు నేర్చుకున్నాను`` అని రజనీకాంత్ ఓ లేఖలో పేర్కొన్నారు. ``నేను మద్యపానం ధూమపానానికి బానిస అయిన సమయంలో.. నువ్వు గొప్ప నటుడిని అవుతావు.. ఈ అలవాట్లతో ఆరోగ్యాన్ని పాడుచేసుకోవద్దని శివకుమార్ నాకు సలహా ఇచ్చేవాడు`` అని రజనీ ఆ లేఖలో పాల్గొన్నారు.
రజనీకాంత్ 1977 లో `కవికుయిల్` .. `భువానా ఓరు కెల్వికురి` అనే రెండు చిత్రాలలో నటించగా.. శివకుమార్ వాటిలో కీలక పాత్రలు పోషించారు. “అతను మంచి మనిషి.. నిజాయితీపరుడు. ఆయన మాటలు నిజమయ్యాయి. నా అలవాట్లు నా ఆరోగ్యాన్ని పాడుచేసాయి. నేను స్టార్ గా సినిమాల్లో పెద్దగా ఎదగగలిగాను” అంటూ ఓసారి జ్ఞాపకాల్లోకి వెళ్లారు. శివకుమార్ సలహాను పాటిస్తే ఎవరైనా శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటాము అంటూ రజనీ తలచుకున్నారు.
బహుముఖ ప్రజ్ఞావంతుడైన శివకుమార్ నవతరం హీరోలు సూర్య.. కార్తీలకు తండ్రి అన్న సంగతి తెలిసిందే. శివకుమార్ మంచి చిత్రలేఖనం కళాకారుడు. 1958 నుండి 1965 వరకు చేసిన శివకుమార్ 100 పెయింటింగ్ లు ఎంతో పాపులర్. భారతదేశం అంతటా చాలా ముఖ్యమైన ప్రదేశాలు అవి కొలువుదీరి ఉన్నాయి.
శివకుమార్ తన గ్రామం నుండి కళారంగంపై ఆసక్తితో చెన్నైకి వెళ్లారు. అయితే విధి తనను ఏమార్చంది. చిత్రలేఖన కళాకారుడు కాకుండా నటుడు అయ్యారు. అతను 1965 చిత్రం కక్కుం కరంగల్ లో ఒక చిన్న పాత్రతో తమిళ పరిశ్రమలో అడుగుపెట్టాడు. మిగిలిన చరిత్ర తెలిసినదే.