Begin typing your search above and press return to search.
సుకుమార్ తనకే సినిమా చేయమన్నాడట
By: Tupaki Desk | 28 Nov 2016 5:30 PM GMTఒక కొత్త దర్శకుడు తీసిన సినిమా చూసి.. తన తర్వాతి సినిమా నా బేనర్లోనే చేయాలి అని సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ అడిగాడంటే.. ఆ దర్శకుడికి అంతకంటే గుర్తింపు ఏం కావాలి. ‘జయమ్ము నిశ్చయమ్మురా’తో దర్శకుడిగా పరిచయమైన శివరాజ్ కనుమూరి ఇలాంటి గుర్తింపే దక్కించుకున్నాడు. తన తొలి సినిమా చూసి సుకుమార్ సహా కొందరు టాలీవుడ్ ప్రముఖులు స్పందించిన తీరు చాలా ఆనందం కలిగించిందని శివరాజ్ తెలిపాడు. ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ గురించి అతనేమన్నాడంటే..
‘‘మనదైన నేటివిటీలో సాగే కథ ఇది. మన చుట్టూ కనిపించే పాత్రలు.. వాటి నుంచి పుట్టుకొచ్చే వినోదంతో సినిమాను తెరకెక్కించాను. అందుకే ‘దేశవాళీ వినోదం’ అనే ట్యాగ్ లైన్ పెట్టాం. తొలి రోజు నాలుగు షోలూ ప్రేక్షకుల మధ్యనే ఉండి చూశా. వాళ్ల స్పందన చూశాక చాలా సంతోషమేసింది. సినిమాలోని ప్రతి సీన్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. క్లైమాక్స్ లో వచ్చే సంస్కృతం డైలాగులకు మంచి రెస్పాన్స్ వచ్చింది. బహుశా ఆ సన్నివేశానికి ‘బాహుబలి’లో కిలికి భాషలో వచ్చే సీన్స్ స్ఫూర్తి అనొచ్చు. ఆత్మన్యూనతా భావానికి.. ఆత్మవిశ్వాసానికి జరిగే సంఘర్షణ ఈ కథ. ‘అల్పజీవి’ లాంటి పుస్తకాలు ఎక్కువగా చదవడం వల్ల కథానాయకుడి పాత్ర అలా తీర్చిదిద్దుకొన్నానేమో. వర్మ - జె.డి.చక్రవర్తి.. వంశీ.. బాపు.. ప్రియదర్శన్.. ఇలా చాలామంది దర్శకుల ప్రభావం నాపై ఉంది. కొరటాల శివ.. త్రివిక్రమ్.. సుకుమార్.. వక్కంతం వంశీ.. వీళ్లందరూ నన్ను బాగా ప్రోత్సహించారు. సుకుమార్ గారైతే నా తర్వాతి సినిమాను తన బేనర్లోనే చేయాలి అన్నారు. ఈ ప్రోత్సాహం ఎప్పటికీ మర్చిపోలేను’’ అని శివరాజ్ తెలిపాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/