Begin typing your search above and press return to search.

తారక్ - చరణ్ కలిసి వాటిని బ్రేక్ చేశారు: శివ రాజ్ కుమార్

By:  Tupaki Desk   |   20 March 2022 6:30 AM GMT
తారక్ - చరణ్ కలిసి వాటిని బ్రేక్ చేశారు: శివ రాజ్ కుమార్
X
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన తాజా చిత్రం ''ఆర్.ఆర్.ఆర్''. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ ఫిక్షనల్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా శనివారం కర్ణాటకలోని చిక్కబల్లపూర్ లో గ్రాండ్ గా RRR ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై తో పాటుగా వర్సటైల్ యాక్టర్ శివ రాజ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో శివ రాజకుమార్ మాట్లాడుతూ.. "ఇక్కడకు వచ్చినందుకు సంతోషంగా ఉంది. అదే సమయంలో అప్పు (తన సోదరుడు దివంగత పునీత్ రాజ్ కుమార్) ఇక్కడ లేనందుకు బాధగా ఉంది. నేను బాధపడితే మీరూ బాధపడతారు. అందుకే నేను బాధపడను'' అని భావోద్వేగంగా మాట్లాడారు.

"నేను రాజమౌళికి పెద్ద అభిమానిని. ఎన్టీఆర్ - రామ్ చరణ్ - చిరంజీవి - అజిత్ - విజయ్.. ఇలా ప్రతి ఒక్కరి సినిమాను ఫస్ట్ డే టికెట్ కొనుక్కొని మరీ థియేటర్ లలో చూస్తాను. నేను అభిమానులతో పాటు సినిమాలను చూడాలనుకుంటాను. నేను ఈ సినిమా కూడా థియేటర్లలో ఫస్ట్ డే ఫస్ట్ షో చూడబోతున్నాను'' అని కన్నడ స్టార్ హీరో తెలిపారు.

''భారతీయ సినిమా ఖ్యాతిని 'బాహుబలి' పెంచింది. తెలుగు చిత్ర పరిశ్రమ నా కుటుంబం. 'ఆర్.ఆర్.ఆర్' కోసం కోట్లమంది ఎలా ఎదురు చూస్తున్నారో నేను కూడా అలాగే ఎదురుచూస్తున్నా. ఒక సాధారణ వ్యక్తిలా ఈ కార్యక్రమానికి వచ్చిన సీఎం బసవరాజు బొమ్మైకు నిజంగా ధన్యవాదాలు. 'RRR' తో ఉగాది ఒక వారం ముందుగానే వచ్చింది" అని శివ రాజ్ కుమార్ అన్నారు.

ఈ సందర్భంగా రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ల మధ్య ఆరోగ్యకరమైన సంబంధం గురించి మాట్లాడారు. "చరణ్ - తారక్ కలిసి ఒక సినిమా చేయటానికి ముందుకు వచ్చి ఫ్యాన్స్ మధ్య రైవల్రీని బ్రేక్ చేశారు. ఇది చాలా ఆరోగ్యకరమైనది. మన మొత్తం చిత్ర పరిశ్రమ ఒక కుటుంబం" అని శివ రాజ్ కుమార్ చెప్పుకొచ్చారు.

ఇక ఈ వేడుకలో రాజమౌళి మాట్లాడుతూ.. రాంచరణ్ - ఎన్టీఆర్ కలిసిన ఈ వేదిక మైత్రీ సంగమం లాంటిదని అభివర్ణించారు. ఓవైపు మెగా అభిమానులను బంగాళాఖాతంతో.. మరోవైపు నందమూరి ఫ్యాన్స్ ని అరేబియా మహాసముద్రంతో పోల్చాడు జక్కన్న. ఇదంతా చూస్తుంటే శ్రీ కృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యం ఇలాగే ఉండేదేమో అనిపిస్తుందని.. ఈ మైత్రీ బందం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నానని రాజమౌళి తెలిపారు.