Begin typing your search above and press return to search.
శివాయ్.. పోస్టర్ సూపర్ అంతే..
By: Tupaki Desk | 22 May 2016 10:50 AM GMTబాలీవుడ్ సూపర్ స్టార్స్ లో ఒకడైన అజయ్ దేవగన్.. ప్రస్తుతం శివాయ్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీని అజయ్ కి డ్రీమ్ ప్రాజెక్ట్ అనాల్సిందే. ఇందుకు కారణం.. ఈ సినిమాలో హీరోగా నటిస్తుండడమే కాదు.. నిర్మాత, దర్శకుడిగా కూడా అజయ్ దేవగన్ బాధ్యతలు తీసుకున్నాడు. అఖిల్ మూవీలో ఆడిపాడిన సాయేషా సైగల్ శివాయ్ లో హీరోయిన్ గా కనిపిస్తోంది.
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన వర్క్ శరవేగంగా సాగుతోంది. ఈ ఏడాది దీపావళికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేయగా.. ప్రస్తుత శివాయ్ కి అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేశాడు అజయ్ దేవగన్. రెండు రోజుల క్రితం టీజర్ పోస్టర్ ని ఇచ్చినా.. ఇప్పుడు అధికారికంగా శివాయ్ కి సంబంధించి పూర్తి పోస్టర్ ను విడుదల చేశాడు. శివుడు ఆకారం సిలౌట్ రూపంలో మాత్రమే కనిపిస్తుండగా.. మంచు కొండల్లో ఎక్కేందుకు తాపత్రపడుతున్నట్లు కనిపిస్తుంది.
ఇక ఓ హెలికాప్టర్ - మంచు కొండలు - వాటిల్లోనే మంటల్లో కూడా పోస్టర్ లో కనిపిస్తాయి. మొత్తంగా ఇదో యాక్షన్ చిత్రంగా మలుస్తున్నాడు అజయ్ దేవగన్. అక్టోబర్ 28న విడుదల చేయనుండగా.. అజయ్ దేవగన్ స్వయంగా నిర్మించి, దర్శకత్వం వహిస్తుండడంతో.. శివాయ్ పై బాలీవుడ్ లో బోలెడంత ఆసక్తి కనిపిస్తోంది.