Begin typing your search above and press return to search.
‘వర్మకు మెంటల్.. డాక్టర్లకు చూపించాలి’
By: Tupaki Desk | 12 Aug 2017 9:01 AM GMTరామ్ గోపాల్ వర్మ మీద మరోసారి ధ్వజమెత్తాడు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు శివాజీ రాజా. వర్మకు మెంటల్ అని.. ఆయన్ని డాక్టర్లకు చూపించాలని శివాజీ రాజా అనడం గమనార్హం. టాలీవుడ్ ను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసుకు సంబంధించి వర్మ మొదట్నుంచి ప్రభుత్వం మీద.. పోలీసు అధికారుల మీద విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు.. డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వానికి లేఖ రాస్తూ.. ఇండస్ట్రీలో కొందరు డ్రగ్స్ చీడపురుగులున్న మాట వాస్తవమే అంటూ లేఖ రాయగా.. దానిపై వర్మ విరుచుకుపడ్డాడు. ప్రభుత్వానికి మీరెందుకు సారీ చెబుతారు.. మీరెలా ఇండస్ట్రీ వాళ్లు తప్పు చేశారని ఒప్పుకుంటారని ప్రశ్నించాడు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లు నిర్దోషులని తేలితే వాళ్లకు క్షమాపణలు చెప్పాలని కూడా డిమాండ్ చేశాడు.
దీనిపై శివాజీ రాజా స్పందిస్తూ.. వర్మకు నిజంగానే మెంటల్ అని.. ఆయన్ని పిచ్చాసుపత్రిలో చూపించాలని.. ఒకరు కాదు ఇద్దరు వైద్యులకు ఆయన్ని చూపించడం అవసరమని అంటూ విరుచుకుపడ్డాడు. పోలీసు అధికారుల్ని రెచ్చగొట్టడం మంచిది కాదని.. వర్మ సైలెంటుగా ఉండాలని శివాజీ రాజా కౌంటర్ ఇచ్చాడు. ఒక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వర్మను శివాజీ రాజా తీవ్ర పదజాలంతో ఏకేశాడు. ఇంతకుముందే ఒకసారి వర్మపై విరుచుకుపడ్డాడు శివాజీ రాజా. వర్మ ఇండస్ట్రీకి చేసిందేమీ లేదని.. వర్మ మాటల్ని ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదని శివాజా రాజీ అభిప్రాయపడ్డాడు.