Begin typing your search above and press return to search.
మా ఎలక్షన్: రాజా కన్నీళ్లు అసలేమైంది?
By: Tupaki Desk | 7 March 2019 5:13 PM GMTమూవీ ఆర్టిస్టుల సంఘం (మా) అసోసియేషన్ ఎన్నికల రచ్చ పీక్స్ కు చేరుకున్న సంగతి తెలిసిందే. మార్చి 10 ఎలక్షన్ డే. 785 మంది సభ్యులున్న మా అసోసియేషన్ అధ్యక్ష పదవి కోసం శివాజీ రాజా - సీనియర్ నరేష్ పోటీపడుతున్న సంగతి తెలిసిందే. గత మూడు రోజులుగా అసోసియేషన్ ఎలక్షన్ పోటీ కి సంబంధించి అసలు రేస్ మొదలైంది. ఏకగ్రీవం అనుకుంటే అనూహ్యంగా ప్రధాన కార్యదర్శి నరేష్ అధ్యక్ష పదవి కోసం శివాజీ రాజాపై పోటీకి దిగడంతో రసవత్తరమైన వ్యవహారం మొదలైంది. ఈ పొలిటికల్ గేమ్ లో ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకోవడం చూస్తుంటే అసలేమైంది వీళ్లకు.. ఎందుకీ రచ్చ? అంటూ జనాల్లో ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు.
గెలుపే ధ్యేయంగా ఎవరికి వారు ఆర్టిస్టుల్లో పబ్లిసిటీ చేసుకుంటున్నారు. అయితే గత రెండ్రోజులుగా సీనియర్ నరేష్ ఏకంగా టీవీ చానెళ్లకు ఎక్కి శివాజీ రాజా అవినీతి పరుడు అని .. మాలో దిగజారుడు తనం ఉందని ఆరోపిస్తూ వ్యక్తిగతంగానూ కించపరిచే వ్యాఖ్యలు చేయడం సంచలనమైంది. తనపై వస్తున్న ఆరోపణలకు శివాజీ రాజా నేటి సాయంత్రం మీడియా సమావేశంలో తీవ్రంగా ఆవేదన చెందారు. మాలో గొడవలు మరీ ఇంతగా దిగజారతాయని అనుకోలేదని నరేష్ తనని అనరాని మాటలు అంటున్నాడని మీడియా సమక్షంలో కళ్లనీళ్ల పర్యంతం అయ్యారు. తనపై వస్తున్న ఆరోపణలకు వివరణ ఇచ్చేందుకే మీడియా ముఖంగా ముందుకు వచ్చానని తెలిపారు. పేద కళాకారులంతా కోరడం వల్లనే వారి కోసం మరోసారి అధ్యక్ష పదవికి పోటీపడుతున్నానని పదవీ వ్యామోహం లేదని శివాజీ రాజా అన్నారు.
నరేష్ తనని అన్యాయంగా అవమానిస్తున్నాడని.. గుండె తరుక్కుపోతోందని శివాజీ రాజా అన్నారు. నా కుటుంబం అంతా అరుణాచలం వెళ్లిపోయి అక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకున్నామని శివాజీ రాజా ఎమోషనల్ అయ్యారు. ఎదుటివారి కళ్లలో కంట తడి చూడలేనని - అలాంటిది తానే కన్నీళ్లు పెట్టానని శివాజీ రాజా అన్నారు. అయితే కన్నీళ్లు పెట్టేంత పిరికితనం లేదని ఆవేదన వల్లనే కన్నీళ్లు పెట్టానని అన్నారు. కవలల్లా కలిసి పని చేసిన శివాజీ- నరేష్ మధ్య గొడవలు పరాకాష్టకు చేరుకున్న సంగతి తెలిసిందే.