Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ గ‌న్స్ సీక్రెట్స్ అలా లీక్

By:  Tupaki Desk   |   27 Dec 2018 8:34 AM GMT
ప‌వ‌న్ గ‌న్స్ సీక్రెట్స్ అలా లీక్
X
న‌క్క‌లైట్ అవ్వాల‌నుకున్నారా ఎప్పుడైనా?

``అవును ఇప్ప‌టికీ ఉంది ఆ కోరిక‌.. లైఫ్ లాంగ్ ఉంటుంది.. ఒక‌ప్పుడు గ‌న్స్ అంటే ఇష్టం``

గ‌న్స్ అంటే ఎందుకింత ఇష్టం?

..చెప్పానుగా `సింధూరం` సినిమాలో ర‌వితేజ పాత్ర నాది బ‌య‌ట‌.. గ‌న్స్ బాగా ఇష్టం.. గ‌న్ లైసెన్స్ వ‌చ్చే వ‌ర‌కూ వ‌దిలిపెట్ట‌లేదు. కొన్న త‌ర్వాత మ‌ళ్లీ మామూలే. ఉప‌యోగించ‌లేదు.

ఓ ఇంట‌ర్వ్యూలో న‌టుడు, `మా` అధ్య‌క్షుడు శివాజీ రాజా స‌ర‌దా సంభాష‌ణ ఇది. గ‌న్స్‌ పై త‌న ప్రేమ‌, అలానే ప‌వ‌న్ క‌ల్యాణ్ తో అనుబంధం గురించి, ప‌వ‌న్ లైసెన్స్‌డ్ గ‌న్ గురించి సీక్రెట్స్‌ని రివీల్ చేశారు. అస‌లు గ‌న్స్ క‌లెక్ష‌న్ ఉందా మీ ద‌గ్గ‌ర‌? అని ప్ర‌శ్నిస్తే.. ఎల‌క్ష‌న్ క‌దా.. పోలీస్ స్టేష‌న్ లో ఉన్నాయి అని ఛ‌మ‌త్క‌రించారు. గ‌న్స్ కోసం న‌క్స‌లైట్ అవుదామ‌నుకున్నారా? అంటే.. `సింధూరం`లో అదే పాత్ర నాది. తొమ్మిదేళ్ల వ‌య‌సులో మీనా బిస్కెట్ కంపెనీలో జాబొస్తే బావుంటుంది.. ఈ వ‌య‌సులో దుబాయ్ వెళితే .. ఈ వ‌య‌సులో గ‌న్ ఉంటే.. ఇలా ఆలోచ‌న‌ ఎప్ప‌టిక‌ప్పుడు మారుతుంది.. ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చాక మాత్రం మార‌లేదు.. 22- 23 వ‌య‌సులో ఉన్న‌ప్పుడు నాకు గ‌న్‌ లైసెన్స్ వ‌చ్చింది అని తెలిపారు. గ‌న్స్ తో వేట‌కు వెళ్లారా? అంటే ఏంటి మెల్లిగా జైల్లో వేస్తారా? అంటూ చాలా ఫ‌న్ క్రియేట్ చేశారు శివాజీ రాజా. ఎప్పుడైనా ఫామ్ హౌస్ కి వెళ్లిన‌ప్ప‌పుడు చెక్ చేసుకోవ‌డానికి మాత్ర‌మే గ‌న్ అంటూ న‌వ్వేశారు.

అలాగే ప‌వ‌న్ క‌ల్యాణ్ సీక్రెట్ ని ఆయ‌న బ‌య‌టికి చెప్పేశారు. ``ప‌వ‌న్ క‌ల్యాణ్ కి గ‌న్ ఉండేది మ‌ద్రాసులో. త‌న‌తో రెండు సార్లు ఫైరింగ్‌కి వెళ్లాను. ప‌వ‌న్ బెంగ‌ళూరులో రైతుల క్ల‌బ్ మెంబ‌ర్ .. నాకు గ‌న్ అంటే ఇష్టం కాబ‌ట్టి.. అలా వెళ్లాను`` అని అన్నారు శివాజీ రాజా. ప‌వ‌న్ మంచి షూటర్.. ఆయ‌న వ‌ల్ల నాకు కూడా గ‌న్ ఇష్టం.. అనీ అన్నారు. మొత్తానికి ప‌వ‌న్ క‌ల్యాణ్‌ గ‌న్ సీక్రెట్ ని ఆయ‌న రివీల్ చేశారు. అంతేకాదు బాల‌య్య బాబుతోనూ మంచి అనుబంధం ఉంద‌ని శివాజీ రాజా తెలిపారు. `సీతా రాముల క‌ళ్యాణం` నుంచి అలానే ఉన్నారాయ‌న‌. `రాజా కాదు కాజా` అని న‌న్ను పిలుస్తారు. ఇన్ని సంవ‌త్స‌రాల త‌ర్వాత ఆయ‌న అలానే ఉన్నారు. బ‌స‌వ‌తార‌కం క్యాన్స‌ర్ ఆస్ప‌త్రిలో అవ‌సరార్థం అడిగితే ఎంద‌రికో సాయం చేశార‌ని శివాజీ రాజా తెలిపారు.