Begin typing your search above and press return to search.

నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన శివాజీరాజా

By:  Tupaki Desk   |   7 April 2019 7:57 AM GMT
నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన శివాజీరాజా
X
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ ల కాలం నడుస్తోంది. ఏ ముహుర్తంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏపీ సీఎం చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పారో కానీ.. ఇప్పుడు పలు సందర్భాల్లో ఈ మాటను వాడుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇటీవల జరిగిన టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన మా ఎన్నికలు జరగటం.. ఆ ఎన్నికల్లో శివాజీరాజా టీం ఓటమిపాలు కావటం తెలిసిందే.

తన ఓటమికి కారణమైన నాగబాబుకు సరైన సమయంలో రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని శివాజీ రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. నరేశ్ ప్యానల్ తో పాటు.. జీవితా రాజశేఖర్లకు మద్దతు ఇవ్వటంతో వారి ప్యానల్ అనూహ్యంగా విజయం సాధించింది. తాము ఓటమి పాలు కావటానికి చివర్లో నాగబాబు మద్దతు ఇవ్వటంగా శివాజీ రాజా ఆరోపణలు చేశారు.

ఇదిలా ఉంటే.. నాగబాబు మద్దతు ఇచ్చిన జీవితా రాజశేఖర్ లు వైఎస్సార్ కాగ్రెస్ పార్టీలో చేరటమే కాదు.. మెగా బ్రదర్ పై విమర్శల పంచ్ లు వేశారు. దీంతో.. జీవిత రాజశేఖర్ లకు మద్దతు ఇచ్చి నాగబాబు తప్పు చేశారన్న అభిప్రాయం వ్యక్తమైంది. తాను ఓడిపోవటానికి కారణమైన నాగబాబుకు సరైన సమయంలో సరైనరిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పిన శివాజీ రాజా అందుకు తగ్గట్లే.. తాజాగా మాట్లాడుతూ నాగబాబుకు ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయద్దంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

నాగబాబు పుణ్యమా అని ‘మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌’ దిగజారిపోయిందని, అభివృద్ధిలో ‘మా’ ను రెండేళ్లు వెనక్కి నెట్టారని ఆయన ధ్వజమెత్తారు. 600 మంది ఉన్న మాకు ఏమీ చేయని నాగబాబు..నర్సాపురం ప్రజలకు మాత్రం ఏదో ఎందుకు చేస్తాడంటూ ఆయన విరుచుకుపడ్డారు. రిటర్న్ గిఫ్ట్.. రిటర్న్ గిఫ్ట్ అనటమే కానీ శివాజీరాజా మాదిరి ఓపెన్ ఇచ్చేయటం లేదు. బాబుకు కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఏమిటన్న దానిపై క్లారిటీ రాకున్నా.. నాగబాబుకు శివాజీరాజా ఇచ్చ రిటర్న్ గిఫ్ట్ ఏదన్న విషయంపై క్లారిటీ వచ్చేయటం ఆసక్తికర అంశంగా చెప్పక తప్పదు.