Begin typing your search above and press return to search.

'మా' ఎన్నికలు... సభ్యులకు మందు తాపించారు

By:  Tupaki Desk   |   21 March 2019 10:16 AM GMT
మా ఎన్నికలు... సభ్యులకు మందు తాపించారు
X
టాలీవుడ్‌ 'మా' ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. హోరా హోరీగా సాగిన ఎన్నికల్లో అధ్యక్షుడు శివాజీ రాజాను నటుడు నరేష్‌ ప్యానల్‌ ఓడించింది. నరేష్‌ కు భారీ మెజార్టీ రావడంతో ప్రమాణ స్వీకారంకు సిద్దం అవుతున్నారు. ఈ సమయంలోనే శివాజీ రాజాపై నరేష్‌ ప్యానల్‌ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న విషయం తెల్సిందే. నరేష్‌ ప్యానల్‌ చేసిన ఆరోపణలపై శివాజీ రాజా స్పందించేందుకు మీడియా ముందుకు వచ్చి సంచలన ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. ఎన్నికల్లో గెలుపు కోసం నరేష్‌ అండ్‌ ప్యానల్‌ ఏ పనులు చేశారో - రూల్స్‌ ఎలా బ్రేక్‌ చేశారో అనే విషయాలను చెప్పుకొచ్చాడు.

శివాజీ రాజా మాట్లాడుతూ... నేను ఎన్నికల్లో రూల్స్‌ బ్రేక్‌ చేయకుండా ఉన్నాను. నా ఓటమికి ఒక కారణం రూల్స్‌ బ్రేక్‌ చేయక పోవడం. కాని వారు మాత్రం నామినేషన్‌ వేసిన రోను ఉండి కూడా అన్ని ఛానెల్స్‌ కు తిరుగుతూ - నాపై ఆరోపణలు చేస్తూ విమర్శలు చేస్తూ వచ్చారు. మా రూల్స్‌ ప్రకారం ఇలా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, మీడియాకు ఎక్కి చర్చలు పెట్టడం విరుద్దం. కాని నరేష్‌ ప్యానల్‌ వారు మాత్రం అన్ని రూల్స్‌ ను బ్రేక్‌ చేశారు. నాపై తప్పుడు ప్రచారం చేశారు. నేను మా సభ్యులకు డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుగోలు చేసినట్లుగా ఆరోపించారు. ఎన్నికల రోజు కూడా నాపై లేనిపోని ఆరోపణలు చేశారు. మీరు ఎన్నికలకు ముందు 200 మంది మా సభ్యులను దస్‌ పల్లా పిలిపించుకుని మందు తాపించి - భోజనం పెట్టించలేదా అంటూ శివాజీ రాజా ప్రశ్నించాడు. ఈ విషయంలో రాజశేఖర్‌ గారు స్పందించాలి. 200 మందికి మందు తాపించిన విషయంలో రాజశేఖర్‌ గారు అయితే ఉన్నది ఉన్నట్లుగా నిజాలు చెబుతారు అంటూ శివాజీ రాజా చెప్పుకొచ్చాడు.

నేను ఓడిపోయినా కూడా నా సాయం ఎవరికి అవసరం ఉన్నా తప్పకుండా నా వంతు సాయం చేసేందుకు ఎప్పుడు ముందే ఉంటాను. మా సభ్యుల కోసం తాను ఎప్పుడు కూడా సాయం చేసేందుకు సిద్దంగా ఉంటానంటూ శివాజీ రాజా చెప్పుకొచ్చాడు. తనను ప్రమాణ స్వీకారంకు పిలిచినా పిలవక పోయినా కూడా 1వ తారీకున నరేష్‌ ను అధ్యక్ష సీటులో కూర్చోబెట్టేందుకు నేను వెళ్తాను - ఆయన్ను దగ్గరుండి నేనే ఆ సీటులో కూర్చోబెడుతాను అంటూ శివాజీ రాజా పేర్కొన్నాడు.