Begin typing your search above and press return to search.
నాకు 600 కోట్లు ఉంటే 6 కోట్లు ఇచ్చేవాడిని
By: Tupaki Desk | 21 March 2019 1:30 AM GMT'మా' తాజా మాజీ అధ్యక్షుడు శివాజీ రాజాపై ఇటీవల కొత్త అధ్యక్షుడు నరేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విషయం తెల్సిందే. తమ ప్యానల్ ప్రమాణ స్వీకారం చేయాలని చూస్తుంటే శివాజీ రాజా మాత్రం తన పదవి కాలం ఇంకా ఉంది, ఇప్పుడే రాజీనామా చేసే ప్రసక్తే లేదు అంటున్నాడు అంటూ నరేష్ వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. నరేష్ తనపై చేసిన ఆరోపణలను మరియు విమర్శలకు సమాధానం చెప్పేందుకు శివాజీ రాజా మరోసారి మీడియా ముందుకు వచ్చాడు. ఈ సందర్బంగా శివాజీ రాజా మాట్లాడుతూ నరేష్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.
మా రూల్స్ ప్రకారం ఎప్పుడైన మార్చిలో ఎన్నికలు నిర్వహించి, ఏప్రిల్ లో కొత్త కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుందని, అదే విషయాన్ని తాను చెప్పగా, రాజీనామా చేసేందుకు తాను నో చెబుతున్నట్లుగా నరేష్ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్న నరేష్ నాపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా ఆరోపించాడు. మా డైరీ యాడ్స్ ద్వారా 14.2 లక్షల రూపాయలు వచ్చాయి. కాని మా అకౌంట్ లో మాత్రం కేవలం 7 లక్షలే పడ్డాయి. మిగిలిన డబ్బులు ఏమయ్యాయి అనే విషయం నరేష్ ఇప్పటి వరకు చెప్పలేదు. నరేష్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో చాలా సార్లు నిధులు వృదా చేశాడు. ఎన్నో సార్లు కూడా మేము చెప్పేందుకు ప్రయత్నించినా కూడా ఆయన పట్టించుకునే వాడు కాదు. నేను, నరేష్, పరుచూరి గారు మలేషియా వెళ్లినప్పుడు మేము సాదారణ రూంలో ఉంటే, నరేష్ మాత్రం సూట్ రూంలో బసచేశారు. ఆ సమయంలోనే ఆయన తాగి ప్లైట్ మిస్ అయితే నేను మరో టికెట్ వేసి ఆయన్ను పంపించాను.
నేను మా మూలధనం 2.9 కోట్లు ఉన్న సమయంలో బాధ్యతలు స్వీకరించాను, ఇప్పుడు మా మూలధనం 5 కోట్లకు చేరింది. కొత్త అధ్యక్షుడు నరేష్ మూల ధనంను 10 కోట్లకు పెంచేలా లక్ష్యంను పెట్టుకోవాలని సూచించాడు. నరేష్ మాదిరిగా నాకు 600 కోట్లు ఉంటే తప్పకుండా 6 కోట్ల రూపాయలను మా కోసం ఇచ్చి, సొంతంగా స్థలం కొనుగోలు చేసి, దాంట్లోనే మా భవనం నిర్మించేవాడిని అంటూ శివాజీ రాజా చెప్పుకొచ్చాడు. మొత్తానికి మా ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా నరేష్ వర్సెస్ శివాజీ రాజా వార్ కొనసాగుతూనే ఉంది. దీనికి ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి.