Begin typing your search above and press return to search.

'మా' ఎన్నిక‌ల వేడి ర‌గిలిస్తోందిగా!!

By:  Tupaki Desk   |   25 Feb 2019 11:30 AM GMT
మా ఎన్నిక‌ల వేడి ర‌గిలిస్తోందిగా!!
X
మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నిక‌ల‌కు స‌మ‌య‌మాస‌న్న‌మైంది. మార్చి 10న ఎన్నిక‌ల‌ ముహూర్తాన్ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ ఎన్నిక‌ల వేడి అంత‌కంత‌కు రాజుకుంటుంద‌ని భావిస్తున్నారు. ఇప్ప‌టికే మూవీ ఆర్టిస్టుల సంఘంలో కొన్ని త‌ప్పిదాల గురించి మీడియా ముఖంగా ఆరోపించిన మా జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ సీనియ‌ర్ న‌రేష్ ఈసారి అధ్య‌క్షుడిగా పోటీ బ‌రిలో దిగుతున్నార‌ని ప్ర‌చారం సాగుతోంది. దీంతో ప్ర‌స్తుత అధ్య‌క్షుడు శివాజీ రాజా రెండోసారి ఏక‌గ్రీవం కానేకాద‌ని అంద‌రికీ అర్థ‌మైంది. అంతేకాదు న‌రేష్ తొంద‌ర్లోనే త‌న ప్యానెల్ మెంబ‌ర్స్ ని ప్ర‌క‌టించ‌బోతున్నార‌ని ఓ ప్ర‌చారం సాగుతోంది.

అయితే ఇప్ప‌టివ‌ర‌కూ న‌రేష్ వైపు నుంచి ఎలాంటి స‌మాచారం లేదు. మూవీ ఆర్టిస్టుల సంఘం ఎన్నిక‌ల్లో తాను పోటీ చేస్తున్నాన‌ని ఆయ‌న ప్ర‌క‌టించ‌నేలేదు. మ‌రోవైపు ప్ర‌స్తుత అధ్య‌క్షుడు శివాజీ రాజా అప్పుడే త‌న త‌ర‌పున పోటీ బ‌రిలో నిలిచే అభ్య‌ర్థుల జాబితాని ప్ర‌క‌టించేశారు. అందుకు సంబంధించిన పోస్ట‌ర్లు ప్ర‌స్తుతం ఫిలింఛాంబ‌ర్ లో వేడెక్కిస్తున్నాయి. మ‌రోసారి శివాజీ రాజా ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్నారు. ఆయ‌న ప్యానెల్ లో హీరో శ్రీ‌కాంత్ - ఎస్వీ కృష్ణారెడ్డి - ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు - త‌నికెళ్ల భ‌రణి - బెన‌ర్జీ - నాగినీడు - సాయికుమార్ - ర‌ఘు - ర‌వి ప్ర‌కాష్‌ - త‌నీష్‌ - ఖ‌య్యుమ్‌ - భూపాల్ రాజు - న‌వ‌భార‌త్ బాలాజీ - సమీర్ హాస‌న్ - అనితా చౌద‌రి - జ‌య‌లక్ష్మి - ఉత్తేజ్ - సురేష్ కొండేటి - అజ‌య్ - రాజీవ్ క‌న‌కాల‌ - వేణుమాధ‌వ్ - బ్ర‌హ్మాజీ - 30 ఇయ‌ర్స్ పృథ్వీ - ఏడిద శ్రీ‌రామ్ స‌భ్యులుగా ఉన్నారు.

శివాజీ రాజా బ‌ర్త్ డే వేడుక‌లు పేరుతో నేడు ప‌లు ర‌కాల ప‌థ‌కాల్ని ప్రక‌టించేశారు. క‌ళ్యాణ‌ల‌క్ష్మి - విద్యా ల‌క్ష్మి - ఫించ‌ను పెంపు వంటి తాయిలాలు తాను ఉన్న‌ప్పుడు మాత్రమే ప్ర‌క‌టించిన‌వి అని తెలిపారు. త‌న ప్రాణం ఉన్నంత‌వ‌ర‌కూ ఈ ప‌థ‌కాల్ని ఆప‌న‌ని .. పేదోడి క‌ష్టం త‌న‌కు తెలుసును అని శివాజీ రాజా అన్నారు. క‌ళాకారుల పిల్ల‌ల చ‌దువుల‌కు ల‌క్ష సాయం - క‌ళ్యాణ ల‌క్ష్మికి రూ.3ల‌క్ష‌ల సాయం అందుతుంద‌ని అన్నారు. ఓల్డేజ్ హోమ్ ప‌థ‌కాన్ని - మూవీఆర్టిస్టుల సంఘం సొంత బిల్డింగ్ నిర్మాణంపైనా శివాజీ రాజా ప్ర‌ణాళిక‌ల్ని ఆర్టిస్టుల‌కు ప్ర‌క‌టించారు. మొత్తానికి శివాజీ రాజా స్పీడ్ పెంచారు. మ‌రి సీనియ‌ర్ న‌రేష్ వైపు నుంచి పిన్ డ్రాప్ సైలెన్స్ ఎందుకో? ఆయ‌నా త‌న ప్యానెల్ తో ప్ర‌చారానికి దిగుతారా? పోటీ బ‌రిలో దిగుతున్నారా.. లేదా? అన్న‌ది తెలియాల్సి ఉంది.