Begin typing your search above and press return to search.

ప్చ్.. అవే రొటీన్‌ లుక్కులూ, సీనులూ...

By:  Tupaki Desk   |   19 Aug 2015 9:51 AM GMT
ప్చ్.. అవే రొటీన్‌ లుక్కులూ, సీనులూ...
X
హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్న రెండు కొత్త సినిమాల పోస్టర్స్ రిలీజయ్యాయి. ఇంకా ఆఢియో ఫంక్షన్ కూడా జరుపుకోకపోయినా... ఈ మూవీస్ పై ఇండస్ట్రీలో అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. కొత్త డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి తో ఎనర్జిటిక్ హీరో రామ్ నటిస్తున్న శివంతో పాటు... హరీష్ శంకర్-సాయిధరం తేజ్ కాంబినేషన్ లో వస్తున్న సుబ్రమణ్యం ఫర్ సేల్ పోస్టర్స్ వచ్చాయి. ఒంగోలుగిత్త, మసాలా వంటి ఫ్లాపుల తర్వాత పండగ చేస్కో మంచి హిట్ అవడంతో.. జోష్ లో ఉన్నాడు రామ్. కానీ ఆ సినిమాకు, ఇప్పటి లుక్ కి ఏమాత్రం మార్పులేదు. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్, రాశి ఖన్నా గ్లామర్ లాంటి హైలైట్స్ ఉన్న ఈ మూవీకి.. రొటీన్ గానే తీర్చిదిద్దినట్లుగా కనిపిస్తోంది. పవర్ ఫుల్ స్క్రిప్ట్ అని చెబ్తున్నా.. అదేమీ కనిపించడంలేదు పోస్టర్స్ లో.

ఇక గబ్బర్ సింగ్ తో ట్యాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకుని టాప్ ప్లేస్ లోకి వచ్చేసిన హరీష్ శంకర్... రామయ్యా వస్తావయ్యా తో వెనకబడ్డాడు. తనని తాను ప్రూవ్ చేసుకునేందుకు ఎంతో శ్రమించి తీస్తున్నాడు సుబ్రమణ్యం ఫర్ సేల్ ని. రెజీనా, సాయిధరం తేజ్ ల పోస్టర్ ని చూస్తే మాత్రం... ఇంకా రొటీన్ ఫార్ములా నుంచి హరీష్ బయటకు రాలేదనిపిస్తోంది. బాహుబలి లాంటి చారిత్రాత్మక విజయం తర్వాత.... మెసేజ్ ఓరియంటెడ్ గా తీసి భారీ కమర్షియల్ సక్సెస్ సాధించాడు శ్రీమంతుడు. వీటిని చూసైనా.. కాస్త వినూత్నంగా ప్రయత్నించాల్సింది. కొత్త కాన్సెప్ట్ లకు తెలుగు జనాలు బ్రహ్మరథం పడుతున్న తరుణంలో.. కాస్త కొత్తగా ట్రై చేయాల్సిన అవసరం ఉంది. డిఫరెంట్ జోనర్స్, ప్రచారాలతో సక్సెస్ లు సాధిస్తున్న తరుణంలో... వీళ్ల రొటీన్ ప్రయత్నాలు ఎంతవరకూ సక్సెస్ అవుతాయో.