Begin typing your search above and press return to search.

ఎట్ట‌కేల‌కు శివ‌మ్‌ కి కోత ప‌డింది

By:  Tupaki Desk   |   3 Oct 2015 3:15 PM GMT
ఎట్ట‌కేల‌కు శివ‌మ్‌ కి కోత ప‌డింది
X
సినిమా బాగుందంటే ఒక ప‌ది నిమిషాలు అటు ఇటైనా పెద్ద‌గా ఇబ్బంది ప‌డ‌రు. కానీ అస‌లే బోర్ సినిమాని తీసి ఆపై దాన్ని లెంగ్తీగా చూపించేస్తామంటే ప్రేక్ష‌కులు అస్స‌లు ఒప్పుకోరు. శివ‌మ్ విష‌యంలో మ‌రోమారు అదే జ‌రిగింది. తొలి రోజే ఆ సినిమాని చూసిన‌వాళ్లంతా అంత లెంగ్తీనా అంటూ పెద‌వి విరిచారు. సినిమాకి నెగిటివ్ టాక్ కూడా వ‌చ్చేయ‌డంతో ఇప్పుడు యూనిట్ న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌ల‌కు పూనుకొంది. సినిమాలో ఏకంగా 20 నిమిషాల పాటు స‌న్నివేశాల్ని తొల‌గించేస్తున్నార‌ట‌. త్వ‌ర‌లోనే ఆ ఎడిట్ వ‌ర్ష‌న్‌ ని విడుద‌ల చేస్తున్నార‌ని తెలిసింది. ఈ సినిమాని ఏకంగా 2 గంట‌ల 40 నిమిషాల నిడివితో విడుద‌ల చేశారు. అంత పెద్ద సినిమానా అని ర‌వికిషోర్‌ ని చాలా మంది హెచ్చ‌రించార‌ట‌. కానీ ఆయ‌న మాత్రం ఏం ఫ‌ర్వాలేదు అన్న‌ట్టు ధైర్యంగా విడుద‌ల చేశారు. తీరా చూస్తే ఇప్పుడు సినిమాకి అదొక మైన‌స్‌ గా మారింది. దీంతో స‌న్నివేశాల్లోనే 20 నిమిషాలు కోత పెట్టేశారు. మ‌రి ఆ రిపేర్లు సినిమాని ఎంత‌వ‌ర‌కు నిల‌బెడ‌తాయ‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

సినిమా ఎంత బాగున్నా స‌రే... కాస్త లెంగ్తీ అనిపిస్తే ఏమాత్రం ఆలోచించ‌కుండా కోత‌లు పెట్టేస్తుంటారు. దిల్‌ రాజు లాంటి నిర్మాత‌యితే ద‌ర్శ‌కుడితో ఫైట్ చేసి మ‌రీ నిర్దాక్షిణ్యంగా స‌న్నివేశాల్ని ఎడిట్ చేసేస్తాడు. `సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు`లో ఆయ‌న ఏకంగా 20 నిమిషాల స‌న్నివేశాల్ని తొల‌గించాడ‌ట‌. ప్రేక్ష‌కుల నాడి తెలుసు కాబ‌ట్టి అలా చేస్తుంటాడాయ‌న‌. స్ర‌వంతి ర‌వికిషోర్ కూడా సీనియ‌ర్ నిర్మాతే. ముప్ప‌య్యేళ్లుగా బ్యాన‌ర్‌ ని న‌డుపుతున్నాడు. కానీ సినిమా భారీగా లెంగ్త్ వున్నా ఆయ‌న మాత్రం పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. పైగా ఓ ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ ``సినిమా లెంగ్తీగా ఉంటే ఎవ‌రికి నష్ట‌మ‌ట‌? రెండు గంట‌ల సినిమాలు చాలానే వ‌చ్చాయి. మ‌రి అవి ఆడ‌లేదే! అలాంటి విష‌యాల్ని నేను ప‌ట్టించుకోను`` అని చెప్పుకొచ్చారు. కానీ సినిమాకి ఒక్క‌సారిగా నెగిటివ్ టాక్ రావ‌డం, అది కూడా లెంగ్త్ విష‌యంలో అలాంటి విమ‌ర్శలు రావ‌డంతో వెన‌క్కి త‌గ్గ‌క త‌ప్ప‌లేదు.