Begin typing your search above and press return to search.

ట్రైలర్‌ టాక్‌: రొటీన్‌ రొటీన్‌ శివం

By:  Tupaki Desk   |   12 Sep 2015 7:05 PM GMT





హ్యాండ్‌ సమ్‌ రామ్‌. అందమైన హీరోయిన్‌. ఓ ముగ్గురు విలన్లు. చిన్న విలన్‌ నుండి పెద్ద విలన్‌ వరకు. రామ్‌ ను బ్రిలియంట్‌ అంటూ పొగిడిసే స్నేహితులు. కట్ చేస్తే మార్కెట్లో ఫైట్లు, పంచ్‌ డైలాగులు. మళ్ళీ కట్ చేస్తే ఫారిన్‌ లో పాటలు. యథావిథిగా మనోడి స్టయిలింగ్‌ కేక. లుక్‌ అరుపులు. హీరోయిన్‌ క్యూట్‌ గా కుమ్మేస్తుంది. ఇదేం సినిమా చెప్పుకోండి చూద్దాం??

దాదాపు ఈ మధ్యన వస్తున్న హీరో రామ్‌ సినిమాలన్నీ ఇలాగే ఉంటున్నాయ్‌. ఇక కొత్తగా వచ్చిన ''శివం'' సినిమా ట్రైలర్‌ కూడా సేమ్‌ టు సేమ్‌ ఇలాగే ఉంది. పరమ రొటీన్‌ గా చూసిన సినిమానే చూస్తున్నట్లుంది. కొత్త దర్శకుడు శ్రీనివాస్‌ రెడ్డితో స్రవంతి రవికిషోర్‌ తమ బ్యానర్‌ 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా తీసిని సినిమా ఇది. ఇంత రొటీన్‌ గా ఉండటంతో కొత్తను కోరుకునే సినిమా లవర్స్‌ బాగా డిజప్పాయింట్‌ అయ్యారు.

ఇకపోతే రామ్‌ ఫ్యాన్సు మాత్రం బాగా ఎక్సయిట్‌ అవుతున్నారు. యథావిథిగా కుర్రాడు బాగానే చేశాడు, ఇక దేవిశ్రీ ప్రసాద్‌ కూడా కుమ్మేశాడు. అయినా శివుడంటే ఎప్పుడూ ఒకేలా ఉంటాడు కదండీ.. అందుకేనేమో రొటీన్ గానే నరుక్కొచ్చారు. కాకపోతే సినిమలో స్ర్కీన్‌ ప్లే మ్యాజిక్‌ ఏదైనా ఉంటే మాత్రం అప్పట్లో పండుగ చేస్కో సినిమా ఆడేసినట్లు బాక్సాఫీస్‌ దగ్గర కాసులు కురిపంచే ఛాన్సుంది.