Begin typing your search above and press return to search.

స్టార్ డాటర్ ఏం ధైర్యం చేసిందిలే

By:  Tupaki Desk   |   15 Jun 2017 2:08 PM GMT
స్టార్ డాటర్ ఏం ధైర్యం చేసిందిలే
X
స్టార్ల వారసులు సినిమాల్లోకి రావడం కామన్. మిగిలిన ఇండస్ట్రీల సంగతి పక్కన పెడితే.. మన దగ్గర మాత్రం అమ్మాయిలను హీరోయిన్లుగా మార్చే కల్చర్ దాదాపుగా లేదనే చెప్పాలి. కానీ ఈ ట్రెండ్ కు బ్రేక్ పడబోతోందని చెప్పచ్చు. రాజశేఖర్.. మాజీ హీరోయిన్ జీవితల కూతురు శివాని ఇప్పుడు ట్రెండ్ బ్రేక్ చేసేస్తోంది.

తాజాగా ఈమె చేసిన ఓ ఫోటో షూట్ అందరికీ షాక్ కొట్టించేసింది. చిన్నపాటి షార్ట్స్ వేసుకుని ఫోటోలకు పోజులు ఇవ్వడం టాలీవుడ్ లో రచ్చ అయిపోయింది. ఇప్పటివరకూ అసలు తెలుగు సినిమా తారల వారసుల్లో కూతుళ్లు ఎవరూ ఈ తరహా ఎక్స్ పోజింగ్ చేయలేదు. గ్లామర్ హీరోయిన్లుగా మారదామని ప్రయత్నించే వారికి సపోర్ట్ లభించలేదు. ఇందుకు చాలామందినే ఎగ్జాంపుల్స్ గా చెప్పుకోవచ్చు. చాలామంది తారల కూతుళ్లు హీరోయిన్స్ గా మారదామని అనుకుని.. చివరకు సైలెంట్ అయిపోయారు. కానీ శివానికి మాత్రం గ్లామర్ హీరోయిన్ అనే స్టాంప్ తో ఇండస్ట్రీలోకి వచ్చేస్తుండడం చూస్తే.. బాలీవుడ్ సోనమ్ కపూర్.. ఆలియా భట్ టైపులో క్రేజ్ సంపాదించుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు.

నిజానికి ఈ విషయంలో కూతురు శివాని ఇంత ధైర్యం చేయడాన్ని సపోర్ట్ చేయడం చూస్తుంటే.. రాజశేఖర్ ను నిజంగానే 'మగాడు' అనాల్సిందే. బాలీవుడ్ లో సోనమ్ కపూర్ ను అనిల్ కపూర్ ప్రోత్సహించిన స్థాయిలో.. శివానికి రాజశేఖర్ సపోర్ట్ లభిస్తుండడం విశేషం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/