Begin typing your search above and press return to search.
హౌస్ లోకి వెళ్లి మరీ బిబి కంటెస్టెంట్ ను మందలించిన తల్లి
By: Tupaki Desk | 30 Dec 2020 7:48 AM GMTతెలుగు బిగ్ బాస్ సీజన్ 4 ముగిసింది. ప్రస్తుతం తమిళ బిగ్ బాస్ సీజన్ 4 ముగింపు దశకు వచ్చింది. మరో మూడు వారాల్లో తమిళ బిగ్ బాస్ ముగియ బోతుంది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులతో మిగిలి ఉన్న కంటెస్టెంట్స్ కు కలిసి మాట్లాడే అవకాశం ఇచ్చారు. తెలుగు బిగ్ బాస్ లో ఈసారి కరోనా కారణంగా కాస్త జాగ్రత్తలు పాటించే ఉద్దేశ్యంతో గ్లాస్ వాల్ ఉంచి కుటుంబ సభ్యులతో మాట్లాడించారు. కాని తమిళ బిగ్ బాస్ హౌస్ లో అలా ఏం చేయలేదు. వారిని నేరుగా లోనికి పంపించారు. ప్రతి ఒక్కరు కూడా వారి కుటుంబ సభ్యులు వచ్చిన సమయంలో ఆనందంలో ఎగిరి గంతేశారు. తమిళ నటి బిగ్ బాస్ కంటెస్టెంట్ శివాని కూడా తన తల్లి వచ్చినందుకు సంతోషించింది. కాని తల్లి తిట్టడంతో ఆమె మొహం కాస్త మాడిపోయింది.
వెండి తెర మరియు బుల్లి తెరపై మంచి గుర్తింపు దక్కించుకున్న శివాని హౌస్ లో కొందరితో సన్నిహితంగా ఉంటూ కొందరిని దూరం పెట్టింది. ముఖ్యంగా ఈమె బాలాజీతో ఎక్కువ సన్నిహిత్యంగా ఉంటుంది. ఆరి అనే మరో కంటెస్టెంట్ తో ఎప్పుడు గొడవ పడుతూ ఉంది. అరితో ఎక్కువగా శివాని గొడవ పడుతున్న కారణంగా సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. బాలాజీతో ఆమె ఎక్కువ క్లోజ్ గా మూవ్ అవ్వడంపై కూడా కామెంట్స్ వస్తున్నాయి. ఆ విషయాన్ని కూతురు వద్ద ప్రస్థావించింది. బాలాజీ వెంటనే ఎందుకు ఎక్కువ ఉంటున్నావు. నీ గేమ్ నీవు ఆడుకోలేవా. మంచి వ్యక్తి అయిన అరితో ఎందుకు గొడవలు అంటూ కూతురు శివానిని మందలించింది. ఆ విషయాలను టెలికాస్ట్ చేయడంతో శివాని తల్లి వ్యాఖ్యలు కాస్త వైరల్ అయ్యాయి.